Tuesday, April 30, 2024
- Advertisement -

షారూక్ ఖాన్ చేస్తాడు.. కానీ అల్లు అర్జున్ చేయను అన్నాడు!

- Advertisement -

బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ అనేక రకాలుగా సంపాదిస్తాడు. కేవలం సినిమాల్లో హీరో నటించి పారితోషకం తీసకోవడం తోనే కాదు.. ఆయనకు అనేక ఆదాయ మార్గాలున్నాయి. వ్యాపారాల సంగతి.. ఎండార్స్ మెంట్ సంగతులు పక్కనపెట్టినా కింగ్ ఖాన్ కు ఇంకా డబ్బు సంపాదించుకొనే మార్గాలున్నాయి. తన గ్లామర్ ను పెట్టుబడిగా పెట్టి ఖాన్ డబ్బు సంపాదిస్తున్నాడు.

అదెలాగంటే.. పేరు, డబ్బు ఉన్నవాళ్ల ఇళ్లలో జరిగే ఫంక్షన్లలో డ్యాన్సులు చేయడం.

విదేశాల్లో జరిగే ప్రైవేట్ కార్యక్రమాల్లో డాన్సులు చేయడం.. ఇలాంటి కార్యక్రమాల ద్వారా కింగ్ ఖాన్ డబ్బు సంపాదిస్తాడు. ఒక సాయంత్రం షో చేసినా కోట్ల రూపాయలు వస్తుంది కాబట్టి కింగ్ ఖాన్ మొహమాటం లేకుండా ఆ పనులు చేస్తున్నాడు. అయితే ఇలాంటి పనులకు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మాత్రం సమ్మతం తెలపలేదని తెలుస్తోంది.

అల్లు అర్జున్ లైవ్ లో డాన్సు ప్రదర్శనలు ఇస్తే.. అతడికి పన్నెండు కోట్ల రూపాయల పారితోషకాన్ని ఇచ్చేందుకు రెడీ అయ్యారట కొంతమంది. విదేశాల్లో జరిగే ఈ ఈవెంట్స్ విషయంలో ఒక సంస్థ అల్లు వారబ్బాయిని సంప్రదించింది. అయితే ఈ హీరో మాత్రం దానికి సమ్మతం తెలపలేదు. అంత డబ్బు ఆఫర్ చేసినా.. వాళ్లు చెప్పిన చోటికి వెళ్లి డాన్సులు చేసే ఓపిక తనకు లేదన్నట్టుగా ఆ ఆఫర్ కు సింపుల్ గా నో.. చెప్పేశాడు. అదీ కథ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -