Monday, April 29, 2024
- Advertisement -

ఏపి మంత్రులు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారా?

- Advertisement -

ఓటుకు నోటు కేసులో టిడిపి పార్టీ ఇరుక్కుపోయిందని చంద్రబాబుకు, ఏపి మంత్రులకు ఎలా భయటపడాలో తోచక అనవసరమైన రాద్దాంతం చేస్తున్నారని తెలంగాణ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

దీనిపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినంత మాత్రాన తప్పు ఒప్పు కాదని, చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడానికి రాష్ట్రాల మధ్య గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు.

దీనికి ఆంధ్ర ప్రజలే టిడిపికి బుద్ది చెబుతారని సూచించారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎందుకు చేయలేదని అలాగే హైదరాబాద్‌లో ఆధార్ కార్డు ఉన్న వారికి ఎందుకు రుణ మాఫీ చేయలేదని ప్రశ్నించారు. ఎవరైనా చట్టానికి అతీతులు కారని, తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే అని అన్నారు.

పి.వి నరసింహారావు వంటి వారు కూడా ఇబ్బంది పడిన సంగతి గుర్తుపెట్టుకోవాలని సూచించారు. రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు, రెచ్చగొట్టే ప్రయత్నాలు మాని విచారణకు సహకరించి నిర్దోషిగా నిరూపించుకోవాలని హితవు పలికారు. ఇది వ్యక్తి గత సమస్యేనని, రాష్ట్రాల సమస్య కాదని హరీష్‌రావు పేర్కొన్నారు. .  

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -