Wednesday, May 8, 2024
- Advertisement -

లాస్ ఏంజిల్స్‌లో ఎన్టీఆర్‌కి యాక్సిడెంట్… రాజమౌళి టీం స్పందన

- Advertisement -

రాజమౌళి సినిమా షూటింగులల్లో కాస్త రిస్క్ ఎక్కువే ఉంటుంది. మగధీర టైంలో రామ్ చరణ్ కూడా గుర్రంపైనుంచి పడి దెబ్బలు తినేవాడే. ఇక బాహుబలి టైంలో హీరోలతో సహా అందరూ కూడా చిన్న చిన్న దెబ్బలు తిన్నవాళ్ళే. ఇప్పుడు అలాంటి ఒక వార్త నెట్‌లో హల్చల్ చేస్తోంది. రాజమౌళి సినిమా టెస్ట్ షూట్ కోసం అమెరికా వెళ్ళిన ఎన్టీఆర్ అక్కడ యాక్సిడెంట్‌కి గురయ్యాడన్నది ఆ వార్త. రాజమౌళి కొడుకు కార్తికేయ దర్శకత్వంలో టెస్ట్ షూట్‌లో పార్టిసిపేట్ చేసిన ఎన్టీఆర్ చిన్న యాక్సిడెంట్‌కి గురయ్యాడన్న వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలను రాజమౌళి టీం ఖండించింది. ఎన్టీఆర్ యాక్సిడెంట్‌కి సంబంధించి వినిపిస్తున్నవార్తలన్నీ పూర్తిగా అవాస్తవాలని చెప్పుకొచ్చింది. అయినా సీజీ వర్క్ కోసం ఎన్టీఆర్ ఫీచర్స్‌ని తీసుకోవడం మాత్రమే జరుగుతోందని…..అలాంటప్పుడు యాక్సిడెంట్ ఎలా అవుతుందని చెప్పుకొచ్చారు రాజమౌళి టీం. శ్రీదేవి మరణవార్త తర్వాత నుంచీ ఇలాంటి వార్తలు భారీగా ప్రచారంలోకి వస్తూనే ఉన్నాయి. రీసెంట్‌గా హీరో శ్రీకాంత్ కూడా అబద్ధాలను ప్రచారం చెయ్యొద్దని మీడియాను రిక్వెస్ట్ చేశాడు. అయినప్పటికీ ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌కి యాక్సిడెంట్ అంటూ అబద్ధపు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ముందు ముందు అయినా ఈ విషయంలో మీడియా సంయమనం పాటిస్తుందేమో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -