Sunday, May 19, 2024
- Advertisement -

ఎన్టీఆర్-చరణ్…….. స్టోరీ లైన్ ఇదేనా……. హాలీవుడ్ సినిమా ఇన్‌స్పిరేషనేనా?

- Advertisement -

రాజమౌళి సినిమాల కమర్షియల్ స్టామినా గురించి కొత్తగా చెప్పేదేముంది? ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేయగల సత్తా రాజమౌళి సొంతం. కాకపోతే మనవాడు కాపీ కొట్టడంలోనూ, పాత కథలు తీయడంతోనే కెరీర్ మొత్తం నెట్టుకొస్తున్నాడు. ఈగలాంటి ప్రయోగాత్మక చిత్రం అయినా, బాహుబలి అయినా…….వేరే ఏసినిమా అయినా ఒకటే కథ. ఒక పెద్ద విలన్………చిన్న హీరో…….ఇద్దరి మధ్యా ఫైట్ ఇంతే.

ఇప్పుడు కూడా చరణ్-ఎన్టీఆర్‌లతో అలాంటి సినిమానే ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. రెండు పరస్పర వైరుధ్యం ఉన్న బాక్సింగ్ క్లబ్‌ల తరపున ఈ ఇద్దరు హీరోలు పోరాడుతూ ఉంటారు. ఈ ఇద్దరి ఆధిపత్యాన్ని చాలా మంది బాక్సర్స్ నిలదీస్తూ ఉంటారు. ఇద్దరూ పరస్పరం పోటీపడేలా వాళ్ళు గేం ఆడతారు. అయితే ఆ ప్రాెసెస్‌లోనే వాళ్ళిద్దరికీ తామిద్దరమూ అన్నదమ్ములం అని తెలుస్తోంది. ఆ తర్వాత వాళ్ళను ఇప్పటి వరకూ వాడుకున్నవాళ్ళే బాక్సర్ అయిన వాళ్ళ నాన్నకు ద్రోహం చేసినవాళ్ళు అని ఆ హీరోలకు తెలుస్తుంది. ఆ తర్వాత ఇద్దరు హీరోలూ కలిసి ఆ విలన్ బ్యాచ్ పైన ఎలా రివేంజ్ తీర్చుకున్నారు అనేది కథ. ఈ కథ యాజ్ ఇట్ ఈజ్‌గా ఒక ఇంగ్లీష్ సినిమా నుంచి తీసుకున్నారన్న మాట వినిపిస్తోంది. రాజమౌళి స్టామినాకు ఇదే కథ అయినా కూడా కమర్షియల్‌గా ఒక రేంజ్‌కి తీసుకెళ్ళగలడు. కాకపోతే అజ్ఙాతవాసి తర్వాత కూడా హాలీవుడ్ సినిమాలను కాపీ కొట్టడం మాత్రం భారీ రిస్క్ అనే చెప్పాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. ఎంత వరకూ నిజమో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -