Tuesday, May 14, 2024
- Advertisement -

ఫోన్ నంబ‌ర్లు ప‌ది కాదు.. ఇప్పుడు 13

- Advertisement -

ఫోన్‌ నంబర్ చెప్ప‌మంటే ప‌ది సంఖ్య‌లు చెబుతారు.. క‌దా ఇప్పుడు ఆ స్థానంలో 13 అంకెలు రానున్నాయి. ఫోన్ నంబ‌ర్ల‌ విషయంలో భద్రతను పెంచేందుకు అధికారులు 13 నంబర్లతో మొబైల్‌ నంబర్‌ తీసుకురానున్నారు. వ‌చ్చే జూలై 1వ తేదీ నుంచి ఈ నంబ‌ర్లు అమ‌లులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. దీని కోసం కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు శ‌ర‌వేగంగా చేప‌డుతున్నారు. త్వరలో కస్టమర్లకు 13 అంకెలతో మొబైల్‌ నంబర్లను జారీ చేయాలని టెలీ కమ్యూనికేషన్‌ విభాగం దేశంలోని అన్ని టెలికాం ఆపరేటర్లకు 13 నంబ‌ర్లు ఇవ్వాల‌ని మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఉన్న మొబైల్‌ నంబర్లు కూడా 13 అంకెల నంబర్‌కు మార్చనున్నారు. 2018 అక్టోబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్‌ 31లోగా ప్రస్తుతం ఉన్న మొబైల్‌ నంబర్లను 13 అంకెలకు మార్చాలని భావిస్తున్నారు.టెలికమ్యూనికేషన్‌ విభాగం నుంచి మార్గదర్శకాలు రావ‌డంతో ఈ 13 నంబ‌ర్లు అంశంపై పనిచేయడం బీఎస్ఎన్ఎల్ అధికారులు ప్రారంభించారు. 13 అంకెల నంబర్లను జారీ చేసే విధానం జూలై 1వ తేదీ నుంచి మొదలుపెట్టనున్నారు. జులై 1వ తేదీ నుంచి ఇక 13 అంకెల మొబైల్‌ నంబర్లే జారీ అవుతాయి. ప్రస్తుతం ఉన్న 10 అంకెల మొబైల్‌ నంబర్లు అక్టోబర్‌ 1వ తేదీ నుంచి మార్చడం ప్రారంభిస్తారు.

భారతి ఎయిర్‌టెల్‌, కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. టెలికాం డిపార్ట్‌మెంట్‌ 13 అంకెల నంబర్‌ విధానాన్ని ఆమోదించిందని ట్రాయ్‌కు రాసిన లేఖలో పేర్కొంది. సమాచార మంత్రిత్వ శాఖ కూడా ట్రాయ్‌కు రాసిన లేఖలో.. సిమ్‌తో నడిచే మెషీన్‌ టు మెషీన్‌ పరికరాలకు 13 అంకెల నంబర్‌ విధానం ఆమోదించినట్లు తెలిపింది. ఇప్పటికే 10 అంకెల నంబర్‌ వాడుతున్న వినియోగదారులు అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31వ తేదీలోపు కొత్త నంబర్‌కు మారాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -