Thursday, April 25, 2024
- Advertisement -

ఆర్ఆర్ఆర్ కి అన్నీ కోట్లా…!

- Advertisement -

సినిమా బిజినెస్ అంటే కేవలం అమ్మడం కొనడం మాత్రమే కాదు. కాకపోతే కొన్ని సినిమాలకి మాత్రం అమ్మడం కొనడం తెలిస్తే చాలు, సక్సెస్ దానంతట అదే నిర్మాతలని, పంపిణీదారులని వెతుక్కుంటూ వస్తుంది. అలాంటి సినిమా ఆర్ఆర్ఆర్. కేవలం రాజమౌళి పేరు మీద వందల కోట్ల బిజినెస్ నడుస్తుంది అంటే మాములు విషయం కాదు. ఈ సారి ఆర్ఆర్ఆర్ కి అటు రాజమౌళి పవర్ తో పాటు గా రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మార్కెట్ మరియు స్టార్ వేల్యూ కూడా యాడ్ అవుతుంది. ఇక హిందీ నటుల వలన పాన్ ఇండియా బిజినెస్ కి డోకా ఉండదు, కాకపోతే ఇలాంటి సినిమాల కె అప్పుడప్పుడు నిర్మాతలు ఓవర్ గా పోయి రేట్లు కోట్ చేస్తూ ఉంటారు.

ఇప్పుడు దానయ్య కూడా అదే చేస్తున్నారు. అయితే నైజాం ప్రాంతం లో ఈ సినెమా ని 80 కోట్లకి అమ్మాలి అని చూస్తున్నారట. బాహుబలి 2 చిత్రం దాదాపు గా 70 కోట్ల వరకు రాబట్టింది. అందుకే ఇప్పుడు ఈ సినిమా తో 80 కోట్ల వరకు బిజినెస్ చేస్తే బాగుంటుంది అని నిర్మాత ఆలోచిస్తున్నారు. అయితే హీరోలు ఇద్దరికీ ఆ రేంజ్ మార్కెట్ అయితే నైజాం లో లేదు. కేవలం దర్శకుడి బలం మీద నే సినిమా ని తీసుకోవాలి కనుక ఈ ప్రాంతం లో ఉన్న హేమాహేమీ పంపిణీదారులు అందరూ ఆలోచన లో పడ్డట్టు తెలుస్తుంది.

చివరికి ఏమవుతుంది అనేది కొన్ని రోజులు ఆగితే గానీ క్లారిటీ రాదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -