Sunday, April 28, 2024
- Advertisement -

ఇక ఏం చేస్తాం నువ్వే ఉండు

- Advertisement -
  • సైరా సినిమాకు థ‌మ‌న్ మ్యూజిక్‌

డేట్లు ఇచ్చిన వారంద‌రూ త‌ప్పుకోవ‌డం.. మ‌ళ్లీ వేరొక‌ర్ని తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించినా.. ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో ఇక ఏం చేస్తాం నువ్వే ఉండు.. ఈ సినిమాకు మ్యూజిక్ నువ్వే ఇవ్వు అన్న‌ట్టు సైరా సినిమాకు ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ ఓకే అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ 150 సినిమా త‌ర్వాత న‌టిస్తున్న సినిమా సైరా. చారిత్ర‌క నేప‌థ్యంతో కూడిన క‌థాంశంతో సినిమా రాబోతోంది. త‌న తండ్రి సినిమాను త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్‌తేజ్ తీస్తున్నాడు. సురేంద‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ఇంత‌కుముందు ఆస్కార్ అవార్డు గ్ర‌హీత ఏ ఆర్ ర‌హ‌మాన్‌ను ఈ సినిమాకు సంగీత ద‌ర్శ‌కుడిగా అనుకున్నారు. అయితే ర‌హ‌మాన్ త‌న టైట్ షెడ్యూల్స్ కార‌ణంగా ఆ సినిమాను చేయ‌లేన‌ని వ‌దిలేసుకున్నాడు. దీంతో చిత్ర బృందం మ‌రో సంగీత ద‌ర్శ‌కుడి వేట‌లో ప‌డింది. స‌డ‌న్‌గా చెప్పేస‌రికి అంద‌రూ కాద‌న్నారు. చివ‌రికి ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌ను ఫైన‌ల్‌గా తీసుకున్నార‌ని స‌మాచారం. అయితే సైరా మూవీ లోగో లాంచ్ స‌మ‌యంలో త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు. ఆ మ్యూజిక్ న‌చ్చింద‌ని క‌ప్పి పుచ్చుతూ చివ‌రికి త‌మ‌న్‌ను క‌న్ఫార్మ్ చేశార‌ని టాక్‌.

ఈ సినిమాను రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని నిర్మిస్తున్నాడు. జాతీయ స్థాయిలో మంచి సినిమాగా తీద్దామ‌నుకుంటే వ‌రుస దెబ్బ‌లు కొడుతున్నాయి. అన్ని భాష‌ల్లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ వేసుకున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -