Tuesday, May 7, 2024
- Advertisement -

‘ఆక్సిజన్‌’ మూవీ రివ్యూ..

- Advertisement -

గోపీచంద్‌ గత కొంతకాలం నుంచి మంచి హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ ఏడాది ‘గౌతమ్‌నంద’ చిత్రంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పుడు ఎలాగైన హిట్ కొట్టాలనే ఆశతో ‘ఆక్సిజన్‌’ మూవీతో వచ్చాడు. జ్యోతికృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో గోపిచంద్ సరసన రాశీఖన్నా.. అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్స్ గా నటించారు. జగపతిబాబు ముఖ్యపాత్రలో కనిపించగా.. యువన్‌ శంకర్‌రాజా సంగీతం అందించారు. మరి ఈ రోజే రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :
రాజమండ్రిలో వూరిపెద్దగా ఉన్న రఘుపతి(జగపతి బాబు) కు ఇద్దరు శత్రువులు ఉంటారు. వారి వల్ల తన ఫ్యామిలీకి ముప్పు ఉందని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాడు. శ్రుతి(రాశి ఖన్నా)కి విదేశీ సంబంధం చూసి పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పి ఓ అమెరికా సంబంధం చూస్తాడు. అలా కృష్ణప్రసాద్‌(గోపీచంద్‌) శ్రుతిని చూడటానికి అమెరికా నుంచి రాజమండ్రి వస్తాడు. అయితే శ్రుతికి ఊరునుంచి వెళ్లడం ఇష్టం లేకా కృష్ణప్రసాద్‌లో లోపాలు చూపిస్తూ.. సంబంధం చెడగొట్టాలని ప్లాన్ చేస్తుంటుంది. కానీ, కృష్ణ చాలా మంచివాడు. కుటుంబానికి బాగా దగ్గరవుతాడు. దాంతో శ్రుతికి కృష్ణప్రసాద్‌కి పెళ్లి చేయాలని ఇంట్లో నిర్ణయిస్తారు. ఈలోగా శత్రువుల నుంచి కుటుంబానికి ముప్పు ఏర్పడుతుంది. ఆ ముప్పు నుంచి కృష్ణప్రసాద్‌ వారిని ఎలా రక్షించాడన్నదే ‘ఆక్సిజన్‌’ స్టోరీ.

విశ్లేషణ :
ఫస్ట్ ఆఫ్ సరదాగా సాగుతుంది.. విశ్రాంతి ముందొచ్చే ట్విస్టే ఈ సినిమాకి ప్రధాన బలం. అప్పటి వరకు మాములు సినిమాలా సాగిన.. ఆ ట్విస్ట్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక సెకండాఫ్ లో సామాజిక అంశం మీద కథ నడిపించాడు దర్శకుడు. పొగతాగడం యువతరాన్ని ఎలా బలిగొంటోందో ద్వితీయార్ధంలో చక్కగా చూపించాడు దర్శకుడు. దానికి తగ్గట్టే ‘ఆక్సిజన్‌’ అన్న టైటిల్‌ని పెట్టారు. ప్రథమార్ధంలో ట్విస్ట్‌‍తో చూసే ప్రేక్షకుడు థ్రిల్ ఫిల్ అవుతాడు. అలాంటివి మరో రెండు మూడు ఉంటే బాగుండేది. కేవలం ఒక ట్విస్ట్‌ను నమ్ముకుని ఈ సినిమా తీసినట్లు అనిపించింది. కామెడీ సీన్స్ మరి కొన్ని ఉంటే బాగుండేది. ఇక గోపిచంద్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు. ఫస్ట్ ఆఫ్ లో బుద్ధిమంతుడిగా.. సెకండాఫ్ లో యాక్షన్‌ ఇమేజ్‌కి తగ్గట్టు అదరగొట్టాడు. రాశీఖన్నా ఎప్పటిలాగే గ్లామరస్‌గా కనిపించింది. అను ఇమ్మాన్యుయేల్‌ది దాదాపు గెస్ట్‌ పాత్ర. జగపతిబాబు తన పాత్రకు న్యాయం చేశాడు. అలీ, ‘కిక్‌’ శ్యాం, అభిమన్యు సింగ్‌ ఓకే అనిపిస్తారు. యువన్‌ శంకర్‌ రాజా సాంగ్స్ కన్న.. నేపథ్య సంగీతం బాగుంది. దర్శకుడు ఎంచుకున్న కథాంశం బాగుంది.

ప్లస్ పాయింట్స్ :
* దర్శకుడు తీసుకున్న అంశం
* యాక్షన్‌ సీన్స్
* సెకండాఫ్ లో గోపీచంద్‌ నటన
* విశ్రాంతి ముందొచ్చే ట్విస్ట్‌
* రాశి కన్నా, అను ఇమ్మాన్యుయేల్‌, జగపతిబాబు
* నెపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :
* రొటీన్ గా సాగిన ఫస్ట్ ఆఫ్
* కామెడీ పెద్దగా లేకపోవడం
* గ్రాఫిక్స్

మొత్తంగా : కమర్షియల్‌ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -