Monday, May 13, 2024
- Advertisement -

రకుల్ ప్రీత్ ని దూరం పెడుతున్న స్టార్ హీరోలు

- Advertisement -

స్టార్డం అందుకున్న ఏ హీరోయిన్ అయినా ఒక సినిమా ఒప్పుకుంది అంటే , సినిమా మొత్తం తన భుజాల మీద అయినా నడవాలి లేదంటే సినిమా కి అత్యధిక పారితోషికం అయినా అందుకోవాలి. ఈ రెండు జరగకుండా ఆ సినిమా అన్ని సినిమాల వలె పెద్దగా ఉపయోగం లేదు అంటే, ఆ స్టార్ హీరోయిన్ కి తిప్పలు తప్పవు అన్నట్టే. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ పరిస్థితి అలాగే ఉంది అంటున్నారు ఫిలిం ఇండస్ట్రీ జనాలు. తెలిసో తెలియకో హిందీ లో దే దే ప్యార్ దే అనే సినిమా లో అజయ్ దేవగన్ సరసన నటించింది. ఆమె కి కావాల్సినట్టే సినిమా విజయం సాధించింది కానీ అనూహ్యం గా రకుల్ ప్రీత్ ని సీనియర్ హీరోల సరసన నటించే హీరోయిన్ గా పరిగణించడం మొదలెట్టారు.

అంతే కాకుండా నాగార్జున పక్కన మన్మధుడు 2 లో నటించడం కూడా ఈ కోవలోకే వస్తుంది. తెలుగు లో మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోల తో నటించిన రకుల్ ని ఈ యువ స్టార్ హీరోలు దూరం పెడుతున్నారట. పైగా రకుల్ సిద్ధార్త్ సరసన భారతీయుడు 2 లో కూడా నటించనుంది.

ఇదంతా దృష్టి లో పెట్టుకొని రకుల్ ని కొన్ని పెద్ద సినిమాలకి అసలు కన్సిడర్ చెయ్యట్లేదు అనే ప్రచారం అయితే ఇండస్ట్రీ లో నడుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -