Saturday, May 18, 2024
- Advertisement -

అనేక వివాదాల మధ్య విండీస్ టూర్ కు బయలు దేరిన టీమిండియా…

- Advertisement -

ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి తరువాత టీమిండియాను అనేక వివాదాలు చుట్టు ముట్టాయి. ప్రధానంగా ధోనిని నాలుగో స్థానంలో పంపకుండా 7 స్థానంలో పంపడంపై కూడా కోహ్లీపై విమర్శలు వచ్చాయి. దానికి తోడు రోహిత్ , కోహ్లీ మధ్య విబుధాలు ఉన్నాయన్న వార్తలు జట్టులో ప్రకంపనలు రేపాయి.

సెమీస్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి తీసుకున్న నిర్ణయాలతో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ విభేదించాడని, ఇది ఇద్దరి మధ్య మనస్పర్థలకు కారణమైందన్న వార్తలు నిన్నమొన్నటి వరకు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. మరో వైపు కెప్టెన్ ను మార్చాలనె విమర్శలను కూడా మాజీ క్రికెటర్లు చేశారు. రోహిత్ ను టీ30, వన్డేలకు కెప్టెన్ గా, కోహ్లీని టెస్ట్ లకు కెప్టెన్ గా నయమించాలనె వాదనలు తెరపైకి వచ్చాయి.

మరోవైపు కోహ్లీ భార్య అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను రోహిత్ అన్‌ఫాలో చేయడం, ప్రతిగా రోహిత్, అతడి భార్య రితికల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను అనుష్క అన్‌ఫాలో చేయడంతో రోహిత్-కోహ్లీ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయన్న వార్తలు జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వచ్చాయి. విండీస్ పర్యటన నేపథ్యంలో రెండు రోజుల క్రితం కోహ్లీ మీడియా ముందుకు వచ్చి తనకు రోహిత్‌కు మధ్య ఏదో ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొట్టేపడేశాడు. వార్తలను గుడ్డిగా నమ్మేయడం కాదని, వాస్తవాలను కూడా అంగీకరించాలని కాసింత గట్టిగానే విమర్శలకు బదులిచ్చారు.

ఈ వార్తల వేడి ఇలా ఉండగానే కోహ్లీ సేన సోమవారం రాత్రి విండీస్ పర్యటనకు బయలుదేరింది. ఆగస్టు మూడో తేదీ నుంచి పర్యటన ప్రారంభం కానుంది. ఆతిథ్య విండీస్‌తో తొలుత మూడు టీ20లు, ఆ తర్వాత మూడు వన్డేలు ఆడనుంది. 22 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. నెల రోజుల పాటు సుదీర్ఘంగ సిరీస్ టీమిండియా ఆడనుంది. ఇన్ని వివాదాల నేపధ్యంలో టీమిండియా ఎలా ఆడుతుందో…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -