Friday, May 3, 2024
- Advertisement -

చైతు, సమంతల పెళ్లి గురించి మన స్టార్స్ ఏమన్నారంటే..?

- Advertisement -

పెళ్లి అంటే ఎవరికైన సంతోషమే. నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంలో ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఇప్పుడు సమంత – నాగచైతన్య పెళ్లి వేడుకలో కూడా అలాంటి పరిణామాలే జరుగుతున్నాయి. పెళ్లి కూతురు చిందులు వేస్తుంటే పెళ్లి కొడుకు మూసి మూసి నవ్వులతో ఆటపట్టిస్తున్నాడు. ఇక బంధువులు కూడా వధూవరులను ఎంతో ఆనందంగా ఆటపట్టిస్తున్నారు. నిన్న రాత్రి సమంత నాగ చైతన్య మేడలో మూడు ముళ్లు వేయగానే ఆ తర్వాత జరిగిన అల్లరి వేడుకలు అన్ని ఇన్ని కావు. దగ్గుపాటి, అక్కినేని ఫ్యామిలీల డ్యాన్సులు అధిరాయి. గ్రాండ్ గా జరిగిన వీరి పెళ్లికి పలువురు హాజరు కాకపోయినా సోషల్ మీడియా ద్వారా విషెస్ ని అందించారు.

మహేష్ బాబు : లవ్లీ కపుల్ ‘చై-సామ్‌’ జంటకు శుభాకాంక్షలు. మీ జీవితంలో ప్రేమ మరియు వెలుగుతో పాటు సంతోషం నిండాలని ఆశిస్తున్నా.

రకుల్ ప్రీత్ సింగ్ : అందమైన జంటకు అభినందనలు. మీరు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటున్నా.
నాని : ఇద్దరూ కలిసి హ్యాపీగా జీవించండి. ‘కార్తీక్‌-జెస్సీ’కి శుభం కార్డు పడిపోయింది.

శృతి హాసన్ : మీ జీవితం మొత్తం ప్రేమ, సంతోషంతో నిండిపోవాలని ఆశిస్తున్నా. గాడ్‌ బ్లెస్‌ యూ.

మంచు మనోజ్ : ఎప్పటికీ కలిసి ఉండండి. మీకు ఇవే నా దీవెనలు. హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌’

త్రిషా : చై-సామ్‌’లకు కంగ్రాట్స్‌. విష్‌ యూ ద బెస్ట్‌.

రాజ్ తరుణ్ : ‘లవ్లీ కపుల్‌కు శుభాకాంక్షలు. మీ ప్రయాణం ఆనందంగా సాగాలని కోరుకుంటున్నా.

హరీష్ శంకర్ : చై-సామ్‌’ జంటకు శుభాకాంక్షలు. కొత్త ప్రయాణానికి ఆల్‌ ద బెస్ట్‌.

కోన వెంకట్ : కలిసి నటించిన ఈ జంట ఇకపై కలిసి జీవిస్తారు. హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌.

మంచు లక్ష్మి : అందమైన పిల్లలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. దేవుడి దీవెనలు మీకు ఉంటాయి. మీ స్టోరీలో మ్యాజిక్‌ ఉంది.

తాప్సి : కంగ్రాట్స్‌ సమంత. నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. నువ్వు ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నా.

తమన్నా: హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌. స్వీట్‌ కపుల్‌.

మెహరీన్ : మీ భవిష్యత్తు మరింత అందంగా ఉండాలని కోరుకుంటున్నా. హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -