Saturday, May 18, 2024
- Advertisement -

ఫేస్ బుక్ కొత్త బటన్ గురించి తెలుసా ?

- Advertisement -

సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఎక్కువైపోతోన్న ఈ తరుణంలో వీటికి అడ్డుకట్ట వేయడానికి పలు కంపెనీలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి.అయితే ఏవి ఓ కొలిక్కి వచ్చిన పాపాన పోలేదు. అందుకే ఈ విషయంలో ఫేస్ బుక్ సీరియస్ గా దృష్టిపెట్టి.. కొత్త ఆవిష్కరణకు నాంది పలికింది.

తప్పుడు సమాచారం,నకిలీ వార్తల విశేషాలను అరికట్టేందుకు మనకు ఓ కొత్త సాధనాన్ని అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేసింది. మనందరికీ తెలిసిన ఫేస్‌బుక్‌ న్యూస్‌ఫీడ్‌ లింక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టబోయే ‘ఐ’ బటన్‌ను పరీక్షిస్తున్నామని ఫేస్‌బుక్‌ ప్రొడక్ట్‌ మేనేజర్లు ఆండ్రూ యాంకర్, సారా సూ, జెఫ్‌ స్మిత్‌లు గురువారం ఓ బ్లాగులో పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌లో వాడకం దారులు తాము చదివే వార్తలకు సంబంధించిన మరింత నాణ్యమైన సమాచారాన్ని ఈ బటన్‌ చూపిస్తుంది. దీని ఆదారంగా మనం ఫాలో అవుతోన్న ఆ వార్త ఎంత నిజమనేదో తెలిసిపోతుంది. అదనే కాదు.

మనం చదువుతోన్న వార్త ఎక్కడనుంచి వచ్చింది. దాని సోర్స్ ఏమిటి అనేది తేటతెల్లం చేసేస్తుంది. ఈ విషయాలకు ఈ బటన్ సాయం చేస్తుంది. మనం చూసే ఆర్టికల్స్, స్టోరీలు నమ్మదగ్గ పబ్లిషర్‌కు సంబంధించినవా? కాదా? లేక మరేవైనా అని మనకు మనం అవగాహన రావడానికి ఉపయోగపడతాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -