Tuesday, April 23, 2024
- Advertisement -

కోసి కారమొండితేగాని… అతడు శాంతించలేదు

- Advertisement -

జిహ్వ చాపల్యం ఎలాంటి పనులనైనా చేయిస్తుందనే మాట సుమత్రా దీవుల్లో జరిగింది. వివరాల్లోకి వెళితే… రాబర్డ్ నబబన్ అనే వ్యక్తి వృత్తి రీత్యా సెక్యురిటీ గార్డుగా పని చేస్తున్నాడు. పాములను తినడానికి అలవాటుపడిన ఇతగాడు నిత్యం పాములను పట్టడానికి కొండల్లోకి, కోనల్లోకి వెళ్తుంటాడు.అతనికి మంచి పామును పట్టి దాని కూర వండి తింటే తప్ప వారానికి ఒకసారి నిద్ర పట్టదట.ఆ ఇదితోనే ఓసారి ఓ సాహసం చేశాడు.

పాముల వేటలో పడిన ఇతగాడికి ఓ సారి ఏకంగా అతని దారికి ఓ భారీ సర్పరాజం అడ్డొచ్చింది. అలా అడ్డొచ్చిన 25.6 అడుగుల(7.8 మీటర్లు) పైథాన్‌తో పోరాడి దెబ్బకు మట్టి కరిపించాడు. స్థానికుల సాయం కూడా రావడంతో ఈ సెక్యురిటీ గార్డు అతిపెద్ద భారీ కొండచిలుని హతమార్చగలిగాడు. ఈ సంఘటన ఇండోనేసియాలోని సుమత్రా దీవిలో చోటుచేసుకుంది. పాములను తినడానికి ఓ హాబిగా చేసుకున్న రాబర్ట్‌ కనిపిస్తోన్న ఈ కొండచిలువను వేటాడేందుకు ట్రై చేశాడు. కాని అది ఇతన్నే తినేయడానికి ప్రయత్నించాడు.

ఈ ప్రాసెస్ లో పరిస్థితిని గమనించిన రాబర్ట్ స్థానికులను గట్టిగా పిలవగా వారంతా వచ్చి ఈ కొండచిలువపై దాడి చేసి.. చంపేశారు. ఈ క్రమంలో మనోడి ఎడమ చేయి తీవ్ర గాయమైంది. అయినప్పటికీ ప్రాథమిక చికిత్స చేయించుకుని.. చనిపోయిన కొండచిలువను అక్కడి స్థానికులకు ప్రదర్శనకు పెట్టాడు. ఆ పోయిన కొండచిలువతో చిన్నారులు ఆడుకుంటూ ఫోటోలు కూడా దిగారు. కాని పోలీసులు వచ్చేలోపు గ్రామస్థులు ఆ కొండచిలువను కోసి వాటాలు వేసుకుని కారం పెట్టుకుని తినేసేలా రాబర్ట్ ట్రీట్ ఇచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -