Wednesday, May 15, 2024
- Advertisement -

ఎన్టీఆర్ చేతికి రింగ్ ఎందుకు పెట్టుకున్నాడంటే..?

- Advertisement -

ఇప్పుడు సినీ పరిశ్రమలో ఉన్న చాలామంది సెలబ్రిటీలు.. రింగ్స్ పెట్టుకుంటున్నారు. కొందరు సెలబ్రిటీలు స్టైయిల్ కోసం పెట్టుకుంటే.. మరి కొందరు సెలబ్రిటీలు జాతకం కోసం రింగులు పెట్టుకుంటున్నారు. అయితే వాటిని పబ్లిక్ కు కనిపించకుండా జాగ్రత్తపడుతున్నారు. కొందరు ఓపెన్ గా చూపించేస్తారు.

రకుల్ ప్రీత్ తన చేతికి ఉన్న కనక పుష్యరాగం రింగును చక్కగా చూపిస్తే.. పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన పెట్టుకునే రింగ్ ను ఎక్కువగా చూపించడానికి ఇష్టపడరు. ఇదాంత ఇప్పుడు ఎందుకంటే.. ఇప్పుడు ఎన్టీఆర్ తన చేతికి పెట్టుకున్న ఉంగరాన్ని గురించి చెప్పాడు కాబట్టి. ఈ మధ్య ఎన్టీఆర్ తన ఉంగరపు వేలికి ఒక కొత్త రింగుతో కనిపిస్తున్నాడు. ఏంటి విషయం అని అడిగితే.. మా ఆవిడ ఇచ్చిన గిఫ్ట్ అనేశాడు. తన భార్య లక్ష్మీ ప్రణతి ఇచ్చిన ఆ ఉంగరంపై ఇప్పుడు ఎన్టీఆర్ కొడుకు అభయరామ్ పేరు.. అలాగే లక్ష్మీ ప్రణతి పేరు ఉన్నాయట.

మరి ఇందులో నా పేరు ఏది బేబి అని అడిగితే.. ‘ఆ రెండు పేర్లకూ మధ్యన ఉన్న డైమండ్ నువ్వే డియర్’ అని చెప్పిందట ప్రణతి. వాటే క్యూట్ మూమెంట్ కదూ.. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ జై లవ కుశ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడూ విభిన్న పాత్రలు పోషిస్తుండగా.. ప్రస్తుతం షూటింగ్ పూణెలో జరుగుతోంది. అలాగే బిగ్ బాస్ షో షూటింగ్ లో కూడా పాల్గొంటూ ఎన్టీఆర్ చాలా బిజీగా ఉన్నాడు. ఈ ఉంగరం గురించి బిగ్ బాస్ కార్యక్రమంలోనే చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -