Friday, May 3, 2024
- Advertisement -

మంత్రుల మాట‌లు కుడి ఎడ‌మైతె పొర‌పాటులేదోయ్‌… ఓట‌మి త‌ప్ప‌దోయ్‌..

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక యుద్ద‌వాతావ‌ర‌నాన్ని త‌ల‌పిస్తోంది.ప్ర‌ధానంగా టీడీపీ నాయ‌కులు వ్యాఖ్య‌ల‌ను విని ప్ర‌జ‌లు ముక్కుమీద వేలేసుకుంటున్నారు. వైసీపీలో ఉన్న‌ప్పుడు భూమాను నోటికొచ్చిన‌ట్లు మాట్లాడి ..ఇప్పుడేమో నీతివంతుడ‌ని టీడీపీ మంత్రుల మాట‌లు పారాకాస్ట‌కు చేరుకున్నాయి.

టీడీపీ నేత కాల్వ శ్రీనివాలు అసెబ్లీలో భూమా నాగిరెడ్డి.. ఒక రౌడీ సార్‌.. ఇలాంటి రౌడీలు శాసనసభలో ఏంటి సార్‌.. నంద్యాల కౌన్సిల్‌ మీటింగ్‌లో భూమా రౌడీయిజం చేశాడు సార్‌.. ‘ ఇదీ కాలువ శ్రీనివాసులు ఏపీ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్య. అసెంబ్లీ రికార్డ్స్‌లో నమోదైన వ్యాఖ్య. మరి సభలో అలా మాట్లాడిన పెద్దమనిషి ఇప్పుడు నంద్యాల్లో భూమా నాగిరెడ్డి గొప్పదనం గురించి సందు సందు తిరిగి చెబుతున్నాడు.

నా తండ్రికి ఏమైనా జరిగితే దానికి చంద్రబాబు నాయుడే కారణం. దానికి చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉంటుంది..’ ఇది మీడియా ముఖంగా అఖిలప్రియ చెప్పిన మాట. అనేక మార్లు ఆమె అలా మాట్లాడారు. తన తండ్రి అరోగ్యం ఏమీ బాగోలేదు, తల్లి చనిపోయాకా ఆయన పరిస్థితి ఏం బాగోలేదు.. అలాంటి ఆయనను చంద్రబాబు ఇబ్బంది పెడుతున్నాడు.. అని అఖిల అప్పట్లో తీవ్రంగా ఆవేదన భరితురాలైంది.

ఇప్పుడెమొ ‘చంద్రబాబు చాలా గొప్ప మనిషి. మా కుటుంబాన్ని ఆదుకున్నాడు, అండగా నిలిచాడు.. అందుకే జగన్‌కు బుద్ధి చెప్పండి..’ అని ఆమె నంద్యాల ప్రజానీకానికి పిలుపునిస్తున్నారు. మరి తండ్రికి ఏమైనా అయితే దానికి కారణం చంద్రబాబే అని చెప్పిన ఆమె, ఇప్పుడు చంద్రబాబు తమను ఆదుకున్నాడు అని చెబుతుంటే.. నవ్వాలో ఏడవాలో తెలియని స్థితిలో ఉన్నారు నంద్యాల ప్రజలు.

ఇక మరోవైపు మంత్రివర్యులు.. ఆదినారాయణ రెడ్డి, అమరనాథ రెడ్డి లాంటి మహనీయులు. వీళ్లు నంద్యాల వీధివీధీ తిరిగి చెబుతున్నది ఏమిటంటే.. జగన్‌కు అధికార దాహం అని. పార్టీ ఫిరాయించి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా.. మంత్రిపదవులు తీసుకున్న వీళ్లు, జగన్‌కు అధికార దాహం అని మాట్లాడుతున్నారు. మ‌రి వీల్ల మాట‌లు విని నంద్యాల ప్ర‌జ‌లు ఓట్లు వేస్తారా అన్న‌ది …ఆస‌క్తిగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -