అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ మరియు సుకుమార్ ల తో సినిమాలు లైన్ లో పెట్టాడు బన్నీ. ‘రంగస్థలం’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సుకుమార్ మహేష్ బాబు తో ఒక సినిమా చేయాల్సి ఉంది కానీ ఆ సినిమా క్యాన్సిల్ అయింది. అయితే తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ తో చేయాల్సిన సినిమా కూడా అటకెక్కేలా కనిపిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం బన్నీ మరియు సుకుమార్ ల మధ్య పెద్ద గొడవ జరిగిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
అయితే తాజాగా హీరో తరఫునుంచి ఆ వార్తల్లో నిజం లేదంటూ క్లారిటీ వచ్చింది. కొందరు కావాలనే అల్లు అర్జున్ మరియు సుకుమార్ ల పై నిందలు మోపాలని ప్రయత్నిస్తున్నట్లు అల్లు క్యాంప్ ఆరోపించింది. ఇంతకు ముందు అల్లు అర్జున్ హీరోగా నటించన ‘ఆర్య’, ‘ఆర్య 2’ సినిమాలకు సుకుమార్ దర్శకత్వం వహించారు. ‘ఆర్య’ సినిమా అప్పటినుంచి బన్నీ తనకి ప్రాణస్నేహితుడు అయిపోయాడు అంటూ సుకుమార్ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ సుకుమార్ తో తన సినిమాని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నాడు.
