Saturday, May 11, 2024
- Advertisement -

త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న మరొక క్రికెటర్ బయోపిక్

- Advertisement -

ప్రస్తుతం బయోపిక్ ల హవా బాగానే నడుస్తుంది. ఒకవైపు సినీ ప్రముఖులు మరియు రాజకీయ నాయకుల బయోపిక్ లు ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, మరో వైపు స్పోర్ట్స్ పర్సన్స్ బయోపిక్ కూడా సిద్ధమౌతున్నాయి. బాలీవుడ్ లో ఇప్పటికే కపిల్ దేవ్ బయోపిక్ లో రణ్వీర్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా ఒక బయోపిక్ తెరకెక్కనుంది. శ్రీలంక బౌలర్ల గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే పేరు మురళీధరన్. ప్రపంచవ్యాప్తంగా గా వన్డే మరియు టెస్ట్ క్రికెట్ మ్యాచ్లు మ్యాచ్లలో ఎక్కువ వికెట్లు తీసిన ఘనత మురళీధరన్ కే దక్కింది.

టెస్ట్ క్రికెట్లో మురళీధరన్ తీసిన వికెట్ల సంఖ్య ‘800’ ను ఈ సినిమాకి టైటిల్ గా ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి మురళీధరన్ పాత్ర పోషించబోతున్నారు అని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి ‘సంగా తమిజన్’, ‘కడైసీ వివైసీ’ మొదలగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత విజయ్ సేతుపతి ‘800’ షూటింగ్ మొదలు పెట్టబోతున్నాడు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ఆఖరు నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -