Sunday, May 5, 2024
- Advertisement -

మ‌రో బోల్డ్ క‌థ‌తో వ‌చ్చిన ‘శుభలేఖ+లు’

- Advertisement -

ఈ మ‌ధ్య యువ ద‌ర్శకులు టీజ‌ర్,ట్రైల‌ర్‌తోనే సినిమాపై ఆస‌క్తి పెంచేస్తున్నారు.తాజాగా ‘శుభలేఖ+లు’ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.ట్రైల‌ర్‌ను బ‌ట్టి చూస్తే ఇది కూడా బోల్డ్ కంటెంట్‌గా తెలుస్తుంది.ఈ సినిమాలో హీరో శ్రీనివాస్ కాగా హీరోయిన్ ప్రియా వడ్లమాని. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ఆవారాగా తిరిగే హీరో.. వాళ్ళ నాన్న హీరోపై సెటైర్లు వేస్తుంటాడు. ఇక మందు కొడుతూ…దమ్ము కొడుతూ ఫాస్ట్ గా ఉన్న తరం అమ్మాయి హీరోయిన్. ఇలాంటి యాటిట్యూడ్ తో హీరోకే ఝలక్ ఇస్తుంటుంది.

మందుకొట్టడం చూసి షాక్ అయిన హీరోతో ‘చిన్న బేబీనేమీ కాను’ అంటూ దబాయిస్తుంది. హీరో ఫ్రెండ్స్ రూమ్ లో ఉన్నప్పుడు ఓ ఫ్రెండ్ ని చూసి “ఏంట్రా ఎప్పుడు చూసినా వీడు బాత్ రూమ్ లోకి వెళ్తుంటాడు? ఏం చేస్తాడ్రా?” అని అడిగితే దానికి ఆన్సర్ ‘బీప్’. హీరో షాక్ అయ్యి ‘ఇప్పుడా?’ అంటాడు. అది బూతేనని మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా? హీరోయిన్ కి పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు ఇష్టం లేదు. “ఒక ముక్కూ మొహం తెలీని వాడితో కలిసి బతకాలన్నమాట. బెడ్ షేర్ చేసుకోవాలన్నమాట. అరేంజ్డ్ మారేజేస్ అలానే ఉంటాయి.. నాన్సెన్స్” అంటుంది. మ‌రి ఈ ట్రైల‌ర్‌ను మీరు కూడా ఓసారి చూసేయండి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -