Wednesday, May 1, 2024
- Advertisement -

మృత్యువును జ‌యించిన చిన్నారి…

- Advertisement -

అదృష్టం ఉంటే మ్యాత్యువు కూడా ద‌రిచేర‌దంటారు పెద్దు. అలాంటి సంఘ‌ట‌ను జ‌రిగిన ఉదంతాలు అనేకం. తాజాగా ఓ చిన్నారి మృత్యువును జ‌యించింది. ఈ సంఘ‌ట‌న ఉత్తరప్రదేశ్‌లోని మథురై రైల్వే స్టేషన్‌లో జరిగింది. పొరపాటున రైలు పట్టాల కింద పడిన ఓ ఏడాది వయస్సు చిన్నారి… చిన్నగాయం కూడా లేకుండా బయటపడిన సంఘ‌ట‌న ఆంద‌ర్నీ ఆశ్చ‌ర్య ప‌రిచింది.

ఢిల్లీ- విశాఖ సమతా ఎక్స్‌ప్రెస్ రైల్లో మథురకు చెందిన సోను దంపతులు తమ పాప సాహిబాతో కలిసి ఆగ్రాకు చేరుకున్నారు. ఒకటో నెంబరు ప్లాట్‌ఫాంపై రైలు ఆగడంతో అందులో నుంచి దిగేందుకు ప్రయత్నించారు. ఓవైపు ప్రయాణీకులు రద్దీ ఎక్కువగా ఉండటం, ఇంతలో రైలు కదలడంతో ఎవరో పాప తల్లిని వెనుక నుంచి నెట్టేశారు. దీంతో చేతిలో ఉన్న చిన్నారి జారిపడి ట్రాక్‌పై పడిపోయింది. ఇంతలో రైలు కదలడంతో బోగీలు ఆమె మీదుగా వెళ్లిపోయాయి.

హఠాత్పరిణామానికి సాహిబా తల్లిదండ్రులతోపాటు అక్కడ ప్రయాణికులంతా నిర్ఘాంతపోయారు. పాప ప్రాణాలతో ఉంటుందనే ఆశను వదిలేసి శిలా విగ్రహాల్లా నిలబడిపోయారు. అయితే చిన్నపాటి గాయం కూడా కాకుండా పాప సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మృత్యువును జయించిన ఆ చిన్నారిని ఆశీర్వదించడానికి తోటి ప్రయాణికులు పోటీపడ్డారు. పట్టాలు, ప్లాట్‌ఫాంకు మధ్య పడటం, రైలు చక్రాలకు, చిన్నారికి మధ్య ఒక్క అంగుళం మాత్రమే దూరం ఉండటం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -