- Advertisement -

ఆ విషయంలో పవన్ కల్యాన్ రికార్డును బద్ధలు కొట్టిన సుదీప్!

- Advertisement -

స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల్లో విలువలకు కట్టుబడి ఉండి సంసారపక్షంగా నడుచుకునే వాళ్లు కొందరు అయితే… తమకు ఉన్న స్టేటస్ తో సతమతమవుతూ సంసార జీవితాన్ని సాగించలేని వాళ్లు మరికొందరు.

ఈ రెండో క్యాటిగిరిలోనే ఉన్నారు హీరోలు పవన్ కల్యాణ్ సుదీప్ లు. వీళ్లిద్దరూ కూడా ఒక భాష లో హీరోలుగా రాణిస్తూ.. స్టార్ స్టేటస్ లో మంచి గుర్తింపు ఉండి.. వైవాహిక జీవితంల విఫలమైన క్యాటగిరీకి చెందిన వారు.  తాజాగా సుదీప్ విడాకుల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. భార్య ప్రియారాధాకృష్ణన్ కు విడాకులు ఇవ్వడం ఖాయం అయ్యింది.

దీంతో వీరి పద్నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితానికి బ్రేక్ పడింది. వీరి వైవాహిక జీవితానికి ఫలంగా పదకొండు సంవత్పరాలున్న పాప కూడా ఉంది. ఆ పాప భారాన్ని భార్యకే అప్పగిస్తూ విడాకులకు సిద్ధం అయ్యాడు సుదీప్. విడాకులే కాదు.. ఈ విడాకుల వ్యవహారంలో సుదీప్ ఇస్తున్న పరిహారం కూడా ఆసక్తికరంగా ఉంది. ఏకంగా 19 కోట్ల రూపాయల పరిహారాన్ని భార్యకు ఇస్తున్నాడు సుదీప్! మరి ఇది కళ్లు చెదిరే మొత్తమే అని చెప్పవచ్చు. ఎంతైన స్టార్ స్టేటస్ లో ఉన్న వ్యక్తి కాబట్టి.. భార్యకు విడాకులు ఇస్తూ అంత మొత్తం ఇవ్వడం పెద్ద లెక్క కూడా కాదు.

పోషణకు.. కూతురికి కలిపి ఆయన ఆ మొత్తం ఇస్తుండవచ్చు. అయితే ఎంతైనా సినిమాల్లో ఎన్నో పాత్రలు చేస్తూ.. తన అభిమానగణానికి నీతులు చెప్పే స్థాయిలో ఉండే హీరోలు ఇలా చేయడం విడ్డూరమే. మరో విశేషం ఏమిటంటే.. ఈ విడాకుల పరిహారం విషయంలో సుదీప్ పవన్ కల్యాణ్ స్థాయిని మించినట్టుగా తెలుస్తోంది. పవన్ తన రెండో భార్య.. రేణూదేశాయ్ కి ఇచ్చిన పరిహారం కంటే.. సుదీప్ తన భార్యకు ఇస్తున్న పరిహారం ఎక్కవ అని టాక్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -