Saturday, May 4, 2024
- Advertisement -

సుధీర్ బాబు ప్రొడక్షన్స్ నెం.1 చిత్రం టైటిల్ “నన్నుదోచుకుందువ‌టే”

- Advertisement -

హ్రుద‌యాన్ని హ‌త్తుకునేలా అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని మంచి క‌థ‌లు ఎంచుకుని హిట్స్ కొడుతున్న హీరోల్లో సుధీర్ బాబు ఓక్క‌ర‌ని చెప్పాలి. సుధీర్ బాబు చేస్తున్న చిత్రాలు ట్రెండ్‌సెట్ట‌ర్ ఫిల్మ్‌గా నిలిచిపోవటానికి కార‌ణం కూడా ఆయ‌న క‌థ‌ల సెల‌క్ష‌న్ అనే చెప్పాలి. రీసెంట్ గా ప్రేక్ష‌కుల‌, విమ‌ర్శ‌కుల ప్ర‌శంశ‌లు పోందిన “స‌మ్మోహ‌నం” ఘ‌న‌విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా స‌మ్మెహ‌నం లో సుధీర్‌బాబు న‌ట‌న గురించి ప్ర‌స్తావించని ప్రేక్ష‌కుడు లేడు. ఇలా విభిన్నమైన కథలతో, పాత్రలతో మెప్పిస్తున్న సుధీర్ బాబు ఇటీవలే తన సొంత నిర్మాణ సంస్థ సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పేరిట‌ స్థాపించిన సంగతి తెలిసిందే. సుధీర్ బాబు ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్న తొలి చిత్రం షూటింగ్ 90 శాతం పూర్తయింది. టాలెంట్‌డ్ ద‌ర్శ‌కుడు ఆర్‌.ఎస్.నాయుడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుధీర్ బాబును విభిన్నమైన కోణంలో, కొత్త‌ స్క్రీన్ ప్లేతో, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథతో, మంచి నిర్మాణ విలువలతో ఈ చిత్రం రూపొందుతోంది. నభ నతేశ్ ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ నెలాఖరులో ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. ఈ చిత్రానికి “న‌న్నుదోచుకుందువ‌టే” టైటిల్ ని ఖ‌రారు చేశారు.

ఈసందర్భంగా దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ… సుధీర్ బాబు గారు హీరోగా ట్రెండింగ్ హిట్స్‌ కొట్టారు. ఆయ‌న‌తో సినిమా చేస్తున్నందుకే హ్యాపిగా వుంది కాని ఆయ‌న ప్రొడక్షన్ లో నా మొదటి చిత్రం చేస్తున్నందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఆయ‌న హీరో గా చేస్తున్న‌ప్ప‌డు హీరోనే.. నిర్మాత‌గా కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా క్వాలిటీగా సినిమాను నిర్మిస్తున్నారు. ప్రోడ‌క్ష‌న్ విలువ‌లు ఎక్క‌డా త‌గ్గ‌కూడ‌దు అనే సంకల్పంతోనే ఆయ‌న చిత్రాన్ని చేశారు. ఆయ‌న‌లో మంచి ఫ్యాష‌నేట్ నిర్మాత కూడా వున్నారు. ఈ చిత్రం లో సుదీర్‌ బాబు క్యారెక్టర్ హైలైట్ గా నిలుస్తుంది. రీసెంట్ గా విడుద‌ల‌య్యి ఘ‌న‌విజ‌యం సాధించిన “స‌మ్మెహ‌నం” నాపై మ‌రింత భాద్య‌తని పెంచింది. కొత్త హీరోయిన్ అయినప్పటికీ నభ నతేశ్ చాలా బాగా చేసింది. అజనీష్ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. ఇప్పటికే 90 శాతం చిత్రీకరణ పూర్తి చేశాం. ఈచిత్రానికి “న‌న్నుదోచుకుందువటే” అనే టైటిల్ ని ఖ‌రారుచేశాము.. త్వరలోనే మిగ‌తా వివ‌రాలు ఎనౌన్స్ చేస్తాం. అని అన్నారు.

నటీనటులు
సుధీర్ బాబు, నభ నతేశ్, నాజర్, తులసి, వేణు, రవి వర్మ, జీవా, వర్షిణి, సౌందర రాజన్, సుదర్శన్ తదితరులు

సాంకేతిక వర్గం
డిఓపి – సురేష్ రగుతు
మ్యూజిక్ డైరెక్టర్ – అజనీష్ బి లోకనాథ్
ఆర్ట్ డైరెక్టర్ – శ్రీకాంత్ రామిశెట్టి
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
పిఆర్ఓ – ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్. సాయి వరుణ్
నిర్మాత – సుధీర్ బాబు
స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ – ఆర్ ఎస్. నాయుడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -