Wednesday, May 8, 2024
- Advertisement -

గంటాను సాగ‌నంపుతున్నారా?

- Advertisement -

మంత్రి గంటా మునుపెన్న‌డు లేని విప‌త్క‌ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయ‌న నియోజిక వ‌ర్గంలోనే ఆయ‌న‌కు శత్రువులు ఎక్కువైయ్యారు. సొంత పార్టీ వాళ్లే గంటాను టార్గెట్ చేస్తు వ్యూహాలు ర‌చిస్తున్నారు. పైగా గంటా వ్య‌క్తిగ‌త ప్రాబల్యం కూడా ఇటీవ‌ల బాగా తగ్గిపోయింది. ఆయ‌న నియోజిక వ‌ర్గంలోని ప్ర‌జ‌లు గంటాపై తీవ్ర వ్య‌తిరేక‌త‌తో ఉన్న‌ట్లు స‌మాచారం. దీనిలో భాగంగానే ఆయ‌న నియోజిక వ‌ర్గ మార్పుపై ఆలోచిస్తున్నార‌ని తెలుస్తుంది.

తాజ‌గా టీడీపీ వాళ్లు చేయించిన స‌ర్వేలో గంటా ప‌నిత‌నం బాలేద‌ని రిపోర్టు వ‌చ్చింద‌ని, ఈ విష‌యంపై చంద్ర‌బాబు గంటాకు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చార‌ని పార్టీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. టీడీపీ నేత‌లు గంటా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీ మార‌డం ఖాయం అని పార్టీ అధినేత‌కు ఫిర్యాదు చేయ‌డంతో చంద్ర‌బాబు గంటాని లైట్ తీసుకున్నార‌ని,దీనిలో భాగంగానే వ‌చ్చే ఎలెక్ష‌న్స్ టైమ్‌కు గంటాకు చెక్ చెప్పాల‌ని బాబు భావిస్తున్నాడు.

గంటా చూపు కూడా వైసీపీ వైపు ఉంద‌ని సమాచారం. పైగా వైసీపీ లీడ‌ర్ విజ‌య‌సాయి రెడ్డి గంటా త‌మ పార్టీలోకి రావ‌ల‌ని చూస్తున్నాడు అని బ‌హిరంగంగానే చెప్పాడు.అప్ప‌ట్లో ఈ వార్త‌లను గంటా ఖండించాడు కూడా. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి గంటా పార్టీ మార‌డం ఖాయంగానే క‌నిపిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -