Friday, May 10, 2024
- Advertisement -

హిందూపురంలో టీడీపీకి షాక్‌!

- Advertisement -

హిందూపురం అంటే అధికార పార్టీ టీడీపీకి కంచుకోట‌. టీడీపీ ఆవిర్భవం నుండి అక్కడి ప్ర‌జ‌లు టీడీపీ అభ్య‌ర్థినే గెలిపిస్తున్నారు. ఎన్టీఆర్ కూడా సొంత నియోజిక వ‌ర్గాన్ని వ‌దిలి హిందూపురం వ‌చ్చి మ‌రి పోటీ చేసి గెలిచారు. ఎన్టీఆర్ త‌న‌యుడు హ‌రికృష్ణ కూడా ఓసారి హిందుపురం నుండి పోటీ చేసి గెలిచాడు. 2014 జ‌ర‌గిన ఎలెక్ష‌న్స్‌లో ఎన్టీఆర్ ఇంకో త‌న‌యుడు బాల‌కృష్ణ కూడా ఇక్క‌డి నుండే పోటీ చేసి ఫ‌స్ట్ టైమ్ ఎమ్మెల్యేగా గెలిచాడు.

అయితే హిందూపురం టీడీపీలో కీల‌క నాయ‌కుడు మాజీ ఎమ్మెల్యే అయిన అబ్దుల్ ఘని పార్టీని వీడే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. 2004,2009 జ‌రిగిన ఎలెక్ష‌న్స్‌లో వైఎస్ఆర్‌ని దీటుగా ఎదుర్కొని ఎమ్మెల్యేగా గెలిచాడు అబ్దుల్ ఘని. అయితే గ‌త ఎన్నిక‌ల‌లో బాలకృష్ణ కోసం ఘని తన సీటును త్యాగం చేశారు. అయితే.. సీటు త్యాగం చేసినందుకు గాను ఆయనకు నామినేటెడ్ పదవి ఇస్తానని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ ని నెరవేర్చడంలో చంద్ర‌బాబు విఫలం అయ్యారు.అటు ఎమ్మెల్యే పదవీ దక్కక.. ఇటు ఇస్తానన్న నామినేటెడ్ పదవీ కూడా దక్కకపోవడంతో ఘనిలో అసంతృప్తి బాగా పెరిగిపోయింది. దీంతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఇదే అవకాశంగా మలుచుకున్న వైసీపీ అతనికి గాలం వేసే పనిలో పడింది. త్వరలోనే పార్టీ మారే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -