Tuesday, May 21, 2024
- Advertisement -

‘స‌మ్మోహ‌నం’లో సుధీర్‌బాబు హిట్ కొట్టేనా!

- Advertisement -

ఇండ‌స్ట్రీకి వ‌చ్చి దాదాపు నాలుగైదేళ్లు అయ్యింది.. ఇప్ప‌టికీ హీరో సుధీర్‌ బాబుకు చెప్పుకోద‌గ్గ హిట్ ల‌భించ‌లేదు. ఏదో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్ర‌స్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘స‌మ్మోహ‌నం’. ‘అమీతుమీ’ సినిమాతో ఆక‌ట్టుకున్న మోహనకృష్ణ ప్ర‌స్తుతం సుధీర్‌బాబుకు ఓ హిట్ సినిమా ఇచ్చే ప‌నిలో బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోంది. ఈ సినిమా టైటిల్‌ లోగోను ఇటీవల విడుద‌ల కాగా ఆక‌ట్టుకుంది. ఈ సినిమాలో సుధీర్ ప‌క్క‌న అదితీరావ్‌ హైదరీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా పోస్ట‌ర్‌ను ఉగాది సందర్భంగా విడుద‌ల చేశారు.

శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను పూర్తిచేసి జూన్‌లో విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -