Thursday, May 9, 2024
- Advertisement -

గంటా బ్యాచ్ సైలెన్స్ వెనుక వ్యూహాలేంటి? బాబుకు దిమ్మతిరిగే షాక్ ఇస్తారా?

- Advertisement -

నాలుగేళ్ళుగా జగన్ చేస్తున్న పోరాటాన్ని, జగన్ మాటలను పూర్తిగా ఓన్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు పవన్, చంద్రబాబులు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, హోదాకు అనుకూలంగా జగన్ మాట్లాడిన మాటలను, జగన్ పోరాటాన్నిచంద్రబాబు హైజాక్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. మరోవైపు చంద్రబాబు, లోకేష్…. టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాలుగేళ్ళుగా జగన్ చేస్తున్న పోరాటాన్ని, చెప్తున్న మాటలను పవన్ హైజాక్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే అందరికీ స్పష్టంగా కనిపిస్తున్న ఈ రాజకీయంతో పాటు అంతర్గతంగా మరో రాజకీయం కూడా నడుస్తోంది.

గంటా శ్రీనివాసరావు, ఆయన సన్నిహితులైన వాళ్ళు ఇప్పుడు దాదాపు పదిమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులైన వీళ్ళు అధికారమే పరమావధిగా రాజకీయాలు చేస్తూ ఉంటారు. 2014ఎన్నికల సమయంలో కూడా గంటాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి పార్టీలో చేర్చుకున్నాడు చంద్రబాబు. అయితే హామీలు ఇచ్చి ప్రజలను వంచించినట్టుగానే నాయకులకు కూడా అబద్ధాలు చెప్పి మోసం చేయడం బాబుకు అలవాటే. వెన్నుపోటు నాడు తోడల్లుడి నుంచీ నందమూరి వారసులతో సహా నేటీ వరకూ ఎంతోమందిని ముంచాడు. తనను దారుణంగా మోసం చేసినప్పటికీ బాబు అధికారంలో ఉండడంతో గంటా మిన్నకుండిపోయాడు. కానీ ఇప్పుడు మాత్రం తన ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటున్నాడని సీనియర్ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. చంద్రబాబుతోనే ఉంటే 2019 తర్వాత అధికారంలోకి వచ్చినా కూడా హోదా పెరగదు. అదే పవన్‌తో వెళ్ళి పవన్ పార్టీకి పాతిక సీట్లపైన వచ్చేలా చేస్తే మాత్రం కింగ్ మేకర్ స్థాయిలో పవన్ ఉంటే గట్టి పదవులే అడగొచ్చు అన్నది గంటా వ్యూహం. గంటాకు నారాయణ వియ్యంకుడు అన్న విషయం తెలిసిందే. ఆ రకంగా ఆర్థికంగా కూడా వందల కోట్లు ఖర్చుపెట్టగల స్థాయిలో ఉన్నవారే. నరేంద్రమోడీని టైం చూసి చంద్రబాబు దెబ్బకొట్టినట్టుగానే గంటా బ్యాచ్ కూడా రైట్ టైం చూసి చంద్రబాబుకు జెల్లకొట్టి పవన్ పంచన చేరడం ఖాయం అన్నది విశ్లేషకుల మాట. అందుకే పవన్ కూడా ఫిరాయింపు రాజకీయాల గురించి పూర్తిగా మౌనం పాటిస్తున్నాడు. ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా మెగా ఫ్యామిలీ ప్లాన్ చేసినట్టుగా జరిగి గంటా వర్గం మొత్తం పవన్ పార్టీలో చేరితే మాత్రం చంద్రబాబు 2019 ఆశలు పూర్తిగా కొడిగట్టిపోయినట్టే. అసలే రాజధాని వ్యవహారాలతో సహా చంద్రబాబు అన్ని అక్రమాలూ నారాయణకూ స్పష్టంగా తెలుసు. కాబట్టి చంద్రబాబు కూడా కిక్కురుమనకుండా సైలెంట్ అవ్వాల్సిందే. కండువాలు మార్చడంలో చాలా పెద్ద స్పెషలిస్ట్స్ అయిన గంటా బ్యాచ్ జనసేన కండువా వేసుకోబోయే ముహూర్తం ఖాయం ఉంటుందన్నది విశ్లేషకుల మాట. కాకపోతే ఆ ముహూర్తం ఎప్పుడన్నదే ఇప్పుడు సస్పెన్స్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -