Monday, May 13, 2024
- Advertisement -

అఫిషియల్ః సక్కూ-సూపర్ స్టార్ కన్ఫాం… షూటింగ్, రిలీజ్ డిటెయిల్స్

- Advertisement -

నాన్నకు ప్రేమతో సినిమాతో హిట్ సినిమా అందించిన సుకుమార్…….. రంగస్థలం సినిమాతో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. కమర్షియల్ సక్సెస్‌లకు మించి ఎన్టీఆర్, చరణ్‌లను సుకుమార్ కొత్తగా ప్రజెంట్ చేసిన వైనం క్రిటిక్స్‌తో పాటు హీరోలను కూడా చాలా మెప్పించింది. అందుకే ఇప్పుడు చిరంజీవితో సహా టాప్ రేంజ్ హీరోలు కూడా సుక్కుతో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సుకుమార్ మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇదే విషయంపై సుకుమార్-మహేష్‌బాబుల మధ్య చర్చలు జరిగాయని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ విషయాన్ని అధికారికంగా చెప్పేశాడు సుకుమార్. ఇప్పుడు తాజాగా ఈ ప్రెస్టీజియస్ సినిమాని నిర్మించబోతున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కూడా ఈ విషయాన్ని కన్ఫాం చేసింది. ఈ ఇయర్ ఎండ్‌లో అంటే నవంబర్, డిసెంబర్‌లలో షూటింగ్ స్టార్ట్ అవుతుందని ……2019 సమ్మర్‌లో సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు మైత్రీ మూవీ మేకర్స్. రంగస్థలం బ్లాక్ బస్టర్ తర్వాత ఫారెన్ టూర్ వెళ్ళిన సుకుమార్….వచ్చిన వెంటనే మహేష్ మూవీ స్క్రిప్ట్ వర్క్స్ స్టార్ట్ చేస్తాడు. ఈలోగా మహేష్ కూడా వంశీ పైడిపల్లి సినిమా కంప్లీట్ చేసుకుని ఆ వెంటనే నవంబర్ నాటికి సుక్కూ సినిమా సెట్స్‌పైకి వచ్చేస్తాడు. 1-నేనొక్కడినే సినిమా కమర్షియల్‌గా ఫ్లాప్ అయినప్పటికీ కంటెంట్ వైజ్….మహేష్ పెర్ఫార్మెన్స్, లుక్స్ వైజ్ మాత్రం చాలా మంది సినిమా లవర్స్‌కి ఎవర్ గ్రీన్ ఫేవరైట్ ఫిల్మ్ అయింది. ఇక ఇప్పుడు రాబోయే సినిమా కమర్షియల్‌గా కూడా కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతుందని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు. సుకుమార్ కూడా మహేష్ కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ ఇచ్చే ప్రయత్నం చేస్తానని చెప్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -