Sunday, May 12, 2024
- Advertisement -

చరణ్ మూవీ టైటిల్ కి 1985కి ఏంటి లింక్..?

- Advertisement -

ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న సినిమా టైటిల్.. ”రంగస్థలం 1985’’ అని ఫిక్స్ చేశారు. అయితే ఈ టైటిల్ చాలా మంది అభిమానులకు నచ్చలేదని.. కానీ దర్శకుడు సుకుమార్ మన మెగా హీరోని ఒప్పించి పెట్టించాడనే రూమర్ నడుస్తోంది. అయితే ఈ టైటిల్ వింటేనే ఇప్పుడు ఇదో వింటేజ్ కథ తాలూకు సినిమా అని అర్ధమైపోతోంది. అయితే దీని గురించి సుకుమార్ ఆసక్తికర విషయాలు తెలిపాడు.

సంక్రాంతి బరిలో రాబోతున్న రంగస్థలం సినిమా.. ఇప్పటికే 50% షూటింగ్ కంప్లీట్ చేసుకుందని సుమారు చెబుతున్నాడు. ఈ మూవీకి ఆ టైటిల్ పెట్టడం వెనుక ఉన్న కారణం చెబుతూ.. ”నిజానికి కథాపరంగా ఆ సమయానికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. మొబైల్ ఫోన్స్ లేని కాలం కావాలని అనుకున్నాం. అందుకే 1985 అంటేనే మా సినిమా వర్కవుట్ అవుతోంది. సో కథ కోసమే వెళ్ళాను” అని చెప్పాడు సుకుమార్. అంతేకాకుండా.. తాను విలేజీలోనే పాతికేళ్ళు పెరిగాడట. అందుచేత.. ఆ బ్యాక్ డ్రాపులో మూవీ తీద్దాంఅని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాడట. ”గతంలో ఆర్య వంటి సిటీ బ్యాక్ డ్రాప్ సినిమాల్లో కూడా నేను పళ్ళెటూరి సీన్స్ పెట్టాను. 100% లవ్ లో కూడా అవి తీశాను.

ఇప్పుడు అవే ఈ సినిమా కోసం పూర్తి స్థాయిలో తీస్తున్నాను” అంటున్నాడు సుకుమార్. ఇప్పటివరకు సమంత కాని, రామ్ చరణ్ కాని తమ కెరియర్లో ఎప్పుడు చేయనటువంటి రోల్స్ ఈ మూవీలో చేస్తున్నారట. అంతేకాకుండా ఈ సినిమాలో సుకుమార్ కమర్షియల్ అంశాలు ఏమీ మిస్ అవ్వకుండా చూసుకుంటున్నాడట. సో 1985 సినిమా అంటే భయపడక్కర్లేదు అని సుకుమార్ అంటున్నాడు.

https://www.youtube.com/watch?v=0I7gWnCAEDo

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -