Saturday, June 1, 2024
- Advertisement -

వివిధ కంపెనీల‌తో పెట్టుబ‌డుల‌కోసం కుదుర్చుకున్న ఒప్పందాలు అన్నీ తుస్సేనా..

- Advertisement -

 రాష్ట్ర విబ‌జ‌న త‌ర్వాత చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పెట్టుబ‌డులు తీసుకొచ్చేందుకు ఆర్భాటంగా ప్ర‌జ‌ల ధ‌నాన్ని మంచినీల్ల‌లా ఖ‌ర్చుపెట్టారు.ప్ర‌చారం మాత్రం ఘ‌నంత‌గా చేశారు గాని పెట్టుబ‌డులు వ‌చ్చింది మాత్రం శూన్యం.ఇదంతా ల‌క్‌స‌భ‌లో సాక్ష్యాత్తు కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ వివిర‌నే నిద‌ర్శ‌నం.

పెట్టుబడుల పేరుతో రెండు సంవత్సరాల్లో చంద్రబాబునాయుడు చేసుకున్న అత్య‌ధికంగా ఇత‌ర సంస్థ‌ల‌తో భారీగా ఒప్పొందాలు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. రాజ్యసభలో కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానం చూస్తే ఎవరికైనా అదే అనుమానం వస్తుంది. రెండు సంవత్సరాల్లో చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు తదితరాలపై వైసీపీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి వేసిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. సమాధానం చూస్తే నోరెళ్లపెట్టాల్సిందే. ఎందుకంటే, 2016, 17 సంవత్సరాల్లో రాష్ట్రప్రభుత్వం పెట్టుబడుల కోసం దేశ, విదేశీ సంస్ధలతో భాగస్వామ్య సదస్సు నిర్వహిచింది భారీ ఎత్తున.

రెండు సదస్సుల్లో కలిపి సుమారు రూ. 15.33 లక్షల కోట్ల విలువైన ఎంవోయులు కుదుర్చుకున్నట్లు చంద్రబాబు ఎంతో ఘనంగా చెప్పుకున్నారో అప్పట్లో. నిజానికి అవన్నీ కార్యరూపం దాలిస్తే 1629 ప్రాజెక్టులు వచ్చుండాలి. కాబట్టి ప్రభుత్వాలు చెప్పుకున్నదాంట్లో కనీసం పావువంతు పెట్టుబడులు వచ్చినా, పరిశ్రమలు వచ్చినా చాలా గొప్పే.

2016 సదస్సులో రూ. 4,78,788 కోట్ల విలువైన 331 ఎంవోయులయ్యాయి. అయితే, రూ. 2,83,943 కోట్ల విలువైన 99 ఎంవోయులకు సంబంధించి ఇప్పటి వరకూ అసలు డిపిఆర్లే అందివ్వలేదట. అదే విధంగా మరో 6 ఎంవోయులను ప్రభుత్వమే వదులుకుంది. ఇక, 2017లో రూ. 10.54 లక్షల కోట్ల విలువైన 665 ఎంవోయులు కుదుర్చుకున్నది. వీటిల్లో 6.34 లక్షల కోట్ల విలువైన 335 ఎంవోయులపై ఇంత వరకూ డిపిఆర్లే అందలేదు.

అంతేకాకుండా రూ. 1.75 లక్షల విలువైన 12 ఎంవోయులను ప్రభుత్వమే వదులుకుంది. కేంద్రమంత్రి ఇన్ని చెప్పారు కానీ అసలు ఎన్ని ఎంవోయులకు డిపిఆర్లు వచ్చాయో చెప్పలేదు. అంటే ఒక్క ఎంవోయుకు కూడా డిపిఆర్ రాలేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. మ‌రి ఇదంతా చంద్ర‌బాబు ప్ర‌చార ఆర్భాటం త‌ప్ప మ‌రేలేద‌న్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -