Saturday, May 18, 2024
- Advertisement -

రాజమౌళి ప్రియతమ శిష్యుడు దర్శకత్వం లో సుమంత్ అశ్విన్

- Advertisement -

సుమంత్ అశ్విన్ భారీ చిత్రాల నిర్మాత ఎమ్ ఎస్ రాజు కుమారుడు. లవర్స్ ,కేరింత, అంతకు ముందు ఆతరువాత లాంటి హిట్స్ ఉన్నప్పటికీ… ఇప్పటికీ.. హీరోగా నిలబడలేకపోయాడు. బహుశా మాస్ హీరో లుక్… సాలిడ్ ఫిజిక్ లేకపోవడమే దీనికి కారణం కావచ్చు. అయితే తాజాగా ఈ కుర్రహీరో రాజమౌళి శిష్యుడి చేతిలో పడ్డాడు.

అతడే కరుణ కుమార్. ఇతను రాజమౌళి ప్రియతమ శిష్యుడు . ఇతగాడు గతంలో నితిన్ తో ద్రోణ సినిమాకు దర్శకత్వం చేశాడు. చాలా గ్యాప్ తరువాత సపందైన లవ్ స్టొరీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రముఖ నిర్మాత మల్కాపురం శివ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

యూత్ ఫుల్ లవ్ సబ్జెక్టు తో తెరకెక్కబోతున్న ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం అవుతుంది. రైటర్ భవాని ప్రసాద్ రచయితగా పని చేస్తున్న ఈ సినమా తాలుకు విశేషాలు మీడియా ముందుకు వచ్చి చెప్పనున్నారు. అయితే ఈసినిమాలో లవ్ తో పాటు సాలిడ్ హీరోయిజం కూడా ఉంటే మాత్రం …ఎమ్ ఎస్ రాజు కుమారుడు కనిపిస్తాడు. లేదంటే ఎప్పటిలాగానే ఆఫ్ స్క్రీన్ లోకి వెళ్లిపోతాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -