Thursday, May 16, 2024
- Advertisement -

గత ఫ్లాపులను మరిపించే స్థాయిలో సునీల్ టూ కంట్రీస్…. దిమ్మతిరిగే దెబ్బేశాడు

- Advertisement -

సునీల్‌కి చివరి హిట్ ఎప్పుడొచ్చింది? హీరోగా సునీల్ చేస్తున్న సినిమాలపైన ప్రేక్షకులకు ఆసక్తి తగ్గిపోయి ఎన్నాళ్ళవుతోంది? బహుశా సునీల్ కూడా మర్చిపోయి ఉంటాడేమో. ఆ రేంజ్ ఫ్లాప్స్ వస్తున్నప్పటికీ సునీల్ మాత్రం కనీస స్థాయి జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదు. ఎంత సేపూ తనో పెద్ద మాస్ హీరో అయిపోవాలి. డ్యాన్సులు ఇరగదీయాలి. అన్నీ బ్రాండెడ్ దుస్తులు, స్టైలిష్ స్పెక్ట్స్‌తో గ్రాఫిక్స్ సాయంతో అందంగా కనడాలన్న తాపత్రయం తప్పితే తనను చూడడం కోసం మాత్రమే ప్రేక్షకులు థియేటర్‌కి రారు అన్న కామన్‌సెన్స్ మాత్రం సునీల్‌కి లేకుండాపోయింది.

సునీల్ సినిమాలకు వెళ్ళాలని ఏ ప్రేక్షకులు అయినా ఎందుకు అనుకుంటారు? సునీల్ కామెడీ కోసం మాత్రమే. ఆ కామెడీ ఓ స్థాయిలో ఉన్న తర్వాత ఇక మిగతా ఏ ఏ అంశాలు సునీల్ కోసం పెట్టినా పెద్దగా పట్టించుకోరు హిట్ చేసేస్తారు. అందాల రాముడు, మర్యాదరామన్న సినిమాలలాగే. ఆ కామెడీనే లేకుండా పోయాక ఇక ఇతర అంశాలు ఎన్ని ఉన్నా ప్రేక్షకులను శాటిస్‌ఫై చేయడం కష్టం. సునీల్ సినిమాల వరకూ ఇది తప్పదు. అయితే సునీల్ మాత్రం ఆ విషయం మర్చిపోయాడు. ఈరోజు రిలీజ్ అయిన టూ కంట్రీస్ కథ కూడా సేం. కనీసం ట్రైలర్‌లో ఉన్నంత కామెడీ కూడా సినిమాలో లేదు. కామెడీ కోసం చాలా చాలా ట్రై చేశారు కానీ కనీస స్థాయిలో నవ్వించలేకపోయారు. కామెడీ విషయంలోనే డిజాస్టర్ అయ్యాక…..ఇక సునీల్ సినిమాల్లో ఏముంటే మాత్రం ఏం నచ్చుతుంది? కనీసం కథ అన్నా కొత్తగా ఉందా అంటే అసలు కొత్త కథలు ఎక్కడున్నాయి అని ఈ సినిమా ప్రమోషన్స్ టైంలోనే మేకర్స్ ఎదురు ప్రశ్నించి కథలో ఏం విషయం లేదని చెప్పేశారు. ఇక సునీల్ డ్యాన్సులు కూడా బ్యాడ్ సాంగ్స్ పుణ్యమాని మరీ బోర్ కొట్టించేస్తున్నాయి. ఈ సినిమాలో కూడా సేం టు సేం. అస్సలు బాగాలేని సాంగ్స్‌కి సునీల్ ఏం డ్యాన్స్ చేస్తే మాత్రం ఏం ఉపయోగం? ఎవరికి నచ్చుతుంది. అన్నింటికీ మించి సునీల్‌లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి. కమెడియన్‌గా ఉన్నప్పుడు హీరోలను మించి అనే స్థాయిలో కామెడీని పండించిన సునీల్……స్టాలిన్ లాంటి సినిమాల క్లైమాక్స్‌లో ఎమోషనల్ యాక్టింగ్ విషయంలో కూడా మెప్పించిన సునీల్ ఇప్పుడు మరీ డల్ అయిపోయాడు. ఇక సునీల్ సెలక్ట్ చేసుకుంటున్న డైరెక్టర్స్, కథలు కూడా మరీ బ్యాడ్‌గా ఉంటున్నాయి. ఈ సినిమా విషయం …….ఈ సంవత్సరాన్ని పక్కనపెడితే సునీల్‌కి 2018 చాలా కీలకం. ఎన్టీఆర్ సినిమాలో కీ రోల్ చేస్తున్నాడు. అలాగే హీరోగా కూడా 2018లోనూ హిట్ కొట్టలేకపోతే మాత్రం ఈ స్టార్ కమెడియన్‌కి కష్టకాలమే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -