Wednesday, May 22, 2024
- Advertisement -

స‌క్సెస్ వ‌చ్చినా ఫ్లాఫ్ అయినా సునీల్ ఎవ‌ర్ని క‌లుస్తారో తెలుసా…?

- Advertisement -

సునీల్ తెరపై ఎంత సున్నితంగా నవ్విస్తాడో .. బయట కూడా ఆయన అంతే సున్నితంగా అందరితోనూ వ్యవహరిస్తాడు. ముఖ్యంగా మెగాస్టార్ పట్ల ఆయనకి గల అభిమానం అప్పుడప్పుడు ఆయా వేదికలపై బయటపడుతూనే ఉంటుంది. మ‌రో సారి చిరుపై త‌న‌కున్న అభిమానాన్ని చాటుకున్నాడు.

సునీల్ నటించిన ‘2 కంట్రీస్’ మూవీ డిసెంబర్ 29న విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీల్ సినిమా గురించిన విశేషాలు పంచుకున్నారు. ఇంట‌ర్వూలో వ్య‌క్తిగ‌త విష‌యాల‌తోపాటు మెగాస్టార్ చిరంజీవిని ప్ర‌స్తావించారు.

చిరంజీవి గారంటే నా కెంతో అభిమానం .. ఆయనంటే ఎంతో ఆరాధన భావం. నాకు సక్సెస్ వచ్చినా .. ఫెయిల్యూర్ వచ్చినా ముందుగా ఆయన దగ్గరకే వెళతాను. ఎందుకంటే ఆయన నాకు ఓ ధైర్యం. సక్సెస్ వచ్చినప్పుడు ఆయన చెప్పే మాటలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపుతాయి. ఎంత జాగ్రత్తగా ఉండాలో చెబుతాయి. అలాగే అపజయం ఎదురైతే ‘ఫర్లేదు సునీల్ నటుడిగా నువ్ ఫెయిల్ కాలేదు .. ప్లాప్స్ అందరికీ వస్తూనే ఉంటాయి’ అంటూ ధైర్యం చెబుతారు. నేను ఈ రోజున ఇంత బాగా డాన్స్ చేయగలగడానికి స్ఫూర్తి కూడా ఆయనే’ అంటూ చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -