Sunday, May 12, 2024
- Advertisement -

పంచాయతీ ఎన్నికల్లో ఓటుకు నోటిస్తే ఏడాది జైలుః ఎన్నికల సంఘం

- Advertisement -

సర్పంచ్ ఎన్నికల్లో ఓటుకు నోటిస్తే ఏడాది జైలు శిక్ష అని ఎన్నికల సంఘం చెప్పింది. ఆ వెంటనే తాటికాయంత అక్షరాలతో ఆ వార్తను పార్టీల కోసం పనిచేసే మీడియా సంస్థలన్నీ గొప్పగా ప్రచురించాయి. ఆ తర్వాత కూడా బోలెడన్ని నియమాలు చెప్పింది ఎన్నికల సంఘం. పార్టీల భజన మీడియా జనాలు కూడా గొప్పగా వార్తలు అందించారు. కాకపోతే జనాలే ఈ వార్తలను చూసి నవ్వుకుంటున్నారు.

సాక్షాత్తూ ఒక ముఖ్యమంత్రి ‘బ్రీఫింగ్’ ఇచ్చిన ఆడియో సాక్ష్యం ఉంది. ఆ ‘బ్రీఫ్డ్ మీ’ వాయిస్ తనది కాదని చెప్పే ధైర్యం కూడా ఇప్పటి వరకూ ఆ ముఖ్యమంత్రి చెప్పే ధైర్యం చేయలేకపోతున్నాడంటేనే…… ఆ వాయిస్ ఎవరిదన్న విషయం ఇట్టే అర్థమయిపోతుంది. ఇక ఒక ఎమ్మెల్యే బేరం మాట్లాడుతూ దాదాపు అరగంట సమయం అన్నీ పూసగుచ్చినట్టు చెప్పిన వీడియో సాక్ష్యం ఉంది. ఇక నోట్ల కట్టల బ్యాగ్ కూడా దొరికింది. ఇన్ని సాక్ష్యాలు ఉంటేనే ఇప్పటి వరకూ ఏమీ చేసింది లేదు? ఎవరికీ శిక్షలు పడింది లేదు. అదీ మన వ్యవస్థల తీరు. అలాంటి వాళ్ళు సర్పంచ్ ఎన్నికల్లో ఓటుకు నోటు ఇస్తే ఏడాది జైలు శిక్ష అని గొప్పగా చెప్పడం…….పార్టీల భజన మీడియా ఆ వార్తను తాటికాయంత అక్షరాలతో ప్రచురించడం…..ఎందుకీ కామెడీ? సోషల్ మీడియాలో నెటిజనులు ఇదే విషయంపై ఏ స్థాయిలో జోకులు వేసుకుంటున్నారో వీళ్ళకు అర్థం కాదా? సోషల్ మీడియాను కేవలం రాజకీయ ప్రచారం కోసమే ఉపయోగించుకుంటారా? ప్రజల స్పందనలను పట్టించుకోరా? ప్రజాస్వామ్యంపైన, వ్యవస్థలపైన కాస్తైనా గౌరవం ఉండాలంటే ముందు తప్పు చేసిన వాళ్ళను శిక్షించండి. ఆ తర్వాత ఇకపై తప్పు చేసేవాళ్ళను శిక్షిస్తాం అని చెప్పండి. అంతేకానీ తప్పు చేసినవాళ్ళు దర్జాగా కళ్ళు ముందు తిరుగుతుంటే……వాళ్ళను కనీసం టచ్ చేయలేని వ్యవస్థలు…..ఇకపై తప్పు చేసినవాళ్ళను శిక్షిస్తాం అంటూ చెప్పే మాటలు జనాలకు కేవలం హాస్యగుళికలుగా మాత్రమే ఉపయోగపడతాయన్నది నిజం. అలాగే తప్పు చేయాలనుకున్నవాడు కనీసం పట్టించుకోడు అన్నది కూడా నిజం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -