Friday, May 17, 2024
- Advertisement -

హీరోగానే కాదు కమెడియన్ గా కూడా వస్తా : సునీల్

- Advertisement -

టాలీవుడ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎందుకంటే.. కామెడీ చేసే వారు కాలం కలిసి వస్తే.. హీరోలు అవుతారు. అదే మంచి సక్సెస్ రేటు ఉన్న హీరోలు.. ప్లాప్ లు వస్తే.. చిన్న చిన్న కార్యేక్టర్లు వేస్తారు. అయితే కామెడీ చేసిన స్టార్స్ నుంచి హీరోలు అయిన వారు టాలీవుడ్ లో చాలామందే ఉన్నారు.

ఇందులో కొందరు హీరోలుగా సక్సెస్ కాగా.. మరికొందరు సక్సెస్ కాలేక మళ్లీ కామెడి రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో చేరిన సునీల్ తన లేటెస్ట్ మూవీ ఉంగరాల రాంబాబు సినిమా రిలీజ్ కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సునీల్ తన సినిమా కెరీర్‌పై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. తన నుండి మంచి కామెడీ వచ్చి చాలా రోజులయ్యిందని గ్రహించిన సునీల్ ఈ దిశగా తన అడుగులు వేస్తున్నాడు. ఇక ప్రస్తుతం తాను హీరోగా తీస్తున్న రెండు సినిమాలు పూర్తి కానుండటంతో ఆ తర్వాత తాను మళ్లీ కామెడి రోల్స్ చేయడానికి ప్రయత్నిస్తానని సునీల్ చెప్పాడు.

ఈ నెపథ్యంలో హీరోగా మంచి ఆఫర్లు వస్తున్న తన నుండి కామెడీని ఎక్స్ పెక్ట్ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సునీల్ చెప్పాడు. హీరోగా తాను ఏమిటో నిరూపించుకున్నాడు కాబట్టే మళ్ళీ తనకు పేరు తెచ్చిన కామెడీ ట్రాక్‌ను సెలెక్ట్ చేసుకున్నాడు సునీల్. ఇక ఏడాదిలో కనీసం రెండు నుండి మూడు సినిమాల్లో కామెడీ రోల్స్ చేయబోతున్నట్లు సునీల్ తెలిపాడు. వీటితో పాటు హీరోగా చేసే సినిమాలు ఉండనే ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -