Thursday, May 16, 2024
- Advertisement -

జీవితాంతం రుణ‌ప‌డి ఉంటా

- Advertisement -
  • ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్‌కు సునీల్ థ్యాంక్స్‌
  • “2 కంట్రీస్” ట్రైల‌ర్ విడుద‌ల

హీరోగా మారిన ఒక‌ప్ప‌టి హాస్య న‌టుడు సునీల్‌న‌, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఇద్ద‌రు మంచి స్నేహితులు. వీరిద్ద‌రి మ‌ధ్య స్నేహాంలో ఏనాడు సినిమా ప‌రిశ్ర‌మ గురించి ముచ్చ‌టే రాలేదు. ఎందుకంటే త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మంచి సినిమాలు తీస్తూ విజ‌య‌వంత‌మైన ద‌ర్శ‌కుడిగా పేరు పొందాడు. ప్ర‌స్తుతం సునీల్ త‌న సినిమాలు వ‌రుస ప‌రాజ‌యంతో బాధ ప‌డుతూ ఉన్నాడు. ఈ స‌మ‌యంలో త‌న కెరియ‌ర్ కోసం తొలిసారి సునీల్ త‌న స్నేహితుడిని క‌లిశాడు. అడిగిందే త‌డువుగా త్రివిక్ర‌మ్ స్పందించాడు.

సునీల్ తన కొత్త సినిమా “2 కంట్రీస్” టీజర్‌ను పవన్ కల్యాణ్‌తో విడుద‌ల చేయించారు. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, ప‌వ‌న్ క‌లిసి సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. “టీజర్ విడుద‌ల చేసిన పవన్ కు జన్మంతా రుణపడి ఉంటాన‌ని సునీల్ తెలిపాడు. ఆయన నాకు తెలుసు. చాలా మంచి మనిషి. త్రివిక్రమ్ కు మనస్ఫూర్తిగా రుణపడి ఉంటా. ఈ రోజును ఎప్పటికీ మరిచిపోలేను.ష అని సునీల్ చెప్పాడు.

ఇక ట్రైల‌ర్ చూస్తే హాస్యంతో కూడిన సినిమా మాదిరి క‌నిపిస్తోంది. పెళ్లి అనేది లాట‌రీ లాటరీ లాంటిది. త‌గిలితే హ్యాపీ.. లేదంటే బీపీ అంటూ ట్రైల‌ర్ ప్రారంభ‌మ‌వుతుంది. ఈ ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంది. ఈసారైనా సునీల్‌కు విజ‌యం ద‌క్కుతుందో లేదో చూడాలి. మ‌న‌మైతే చెప్పి సునీల్‌కు స‌హ‌క‌రిద్దాం. ఈ సినిమాలో ప్ర‌ధాన తారాగ‌ణం అంతా ఉంది. ఈ సినిమా హాస్య‌పుజ‌ల్లులు కురిపించే అవ‌కాశం ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

https://youtu.be/cnIXCqOneZE

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -