- Advertisement -

హాట్‌బాంబ్ భారీ క‌స‌ర‌త్తులు

- Advertisement -

హాట్ బాంబ్ స‌న్నీలియోన్ చిన్న చిన్న రోల్స్ అయిన అటు నార్త్.. ఇటు సౌత్ ఇండస్ట్రీలో బీజీగా ఉంది. ఒక‌వైపు ఐటెం సాంగ్స్ చేస్తూనే మ‌రో వైపు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ప‌లు చిత్రాలు చేస్తుంది. త‌మిళంలో సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో వీర‌మాదేవి అనే ఫుల్ ప్లెడ్జ్‌డ్ చిత్రం చేస్తుంది . ఈ మూవీ సౌత్ ఇండియన్ కల్చర్స్ బ్యాక్ డ్రాప్ తో చారిత్రాత్మక యుద్ధ నేపథ్యంలో తెర‌కెక్కుతుంది.

తెలుగు, తమిళం, హిందీతో పాటు ప‌లు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని వి.సి.వడివుడయన్ తెరకెక్కించనుండగా, స్టీవ్స్ కార్నర్ బ్యాన‌ర్‌పై పోన్స్ స్టిఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌రోవైపు మ‌ల‌యాళం డెబ్యూ చిత్రం కూడా చేస్తుంది స‌న్నీ. ఈ ప్రాజెక్ట్‌కి రంగీలా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రోడ్ నేప‌థ్యంలో రూపొంద‌నున్న ఈ చిత్రం హాస్యంతో పాటు థ్రిల్లింగ్‌గా ఉంటుంద‌ట‌. మ‌మ్ముట్టి చిత్రం మ‌ధుర రాజాలో స్పెష‌ల్ సాంగ్ చేస్తుంది స‌న్నీ.

మ‌రి ఇన్ని ప్రాజెక్టుల్లో బిజీగా ఉండి కూడా త‌న వ‌ర్క‌వుట్స్‌ను ఏమాత్రం మిస్ చేయ‌డం లేదు స‌న్నీ. తాజాగా స‌న్నీలియోన్ జిమ్‌లో చేస్తున్న వ‌ర్క‌వుట్స్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతున్నాయి. మ‌రోవైపు ఫ్లిప్ అండ్ కిక్‌కి సంబంధించిన వ‌ర్క‌వుట్స్ కూడా చేస్తుంది. ఈ విన్యాసాలు నెటిజన్స్‌కి షాకింగ్‌గా ఉన్నాయ‌నే చెప్పాలి.

https://www.instagram.com/p/BueSKP7B4aV/?utm_source=ig_web_button_share_sheet
https://www.instagram.com/p/BuZUEzUBi6R/?utm_source=ig_web_button_share_sheet

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -