- Advertisement -

టీడీపీకీ చ‌ల్లారాజీనామా..ఈనెల 8న వైసీపీలోకి..

- Advertisement -

త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో టికెట్ల గోల సంగ‌తేమో గాని వ‌ల‌స‌లు మాత్రం కొన‌సాగుతున్నాయి. టీడీప‌లో టికెట్ ద‌క్క‌ని వాళ్లంతా వైసీపీలోకి , వైసీపీలో టికెట్ ద‌క్క‌ని వాల్లు టీడీపీలోకి జంపింగ్ చేస్తూ పార్టీ అధినేత‌ల‌కు షాక్ ఇస్తున్నారు. తాజాగా క‌ర్నూలు జిల్లాలో టీడీపీకీ భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. ఇప్ప‌టికే టీడీపీనుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. ఇప్పుడు మ‌రో సీనియ‌ర్ నేత వైసీపీ గూటికి చేర‌నున్నారు.

క‌ర్నూలు టీడీపీ సీనియ‌ర్ నేత చ‌ల్లా రామ‌కృష్ణారెడ్డి టీడీపీకీ రాజీనామా చేశారు. ఈమేరకు ఆయన సోమవారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తన రాజీనామా లేఖను పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల టీడీపీకి, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.

గ‌త కొంత కాలంగా అధిష్టానంపై గుర్రుగా ఉన్న ఆయ‌న పార్టీని వీడాల‌ని నిర్ణ‌యించుకున్నారు. చల్లా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మ‌ధ్య‌నే కోట్ల కుంటుంబం కూడా టీడీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే.

పార్టీకీ రాజీనామా చేసిన చ‌ల్లా రామ‌కృష్ణారెడ్డి త్వ‌ర‌లో వైసీపీ కండువా క‌ప్పుకోనున్నారు. గౌరు ఫ్యామిలీ పార్టీప‌ద‌వుల‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యారు. ఇప్పుడు చ‌ల్లా వైసీపీలో చేర‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఇప్ప‌టికే ఆయ‌న జ‌గ‌న్‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. జ‌గ‌న్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈనెల 8వతేదీన వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వైసీపీలో చేరబోతున్నారని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -