Friday, May 17, 2024
- Advertisement -

జ‌గ‌న్ పోటీ చేసె నియోజ‌క వ‌ర్గం మార‌నుందా….?

- Advertisement -

త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ త‌న స‌త్తా చాటాలాని అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. గెలుపే ధ్యేయంగా పావులు క‌దుపుతున్నారు. టికెట్ల విష‌యంలో బంధువులు అని చూడ‌కుండా క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. గెల‌పు గుర్రాల‌కే టికెట్లు ఇస్తూ బంధువుల‌ను కూడా ప‌క్క‌న పెడుతున్నారు. ఇప్ప‌టికే అభ్య‌ర్తుల విష‌యంలో నిర్ణ‌యానికి వ‌చ్చిన జ‌గ‌న్ టికెట్ల కేటాయింపుల్లో బిజీగా ఉన్నారు.

టికెట్ల వ్య‌వ‌హారాన్ని పూర్తిచేసిన జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి సిద్ద‌మ‌వుతున్నారు. త్వ‌ర‌లోనే బ‌స్సు యాత్ర‌ను ప్రారంభించ‌డానికి సిద్ద‌మ‌వుతున్నారు. అయితే జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప నుంచి కాకుండా రాజ‌ధాని ప్రాంతంనుచి పోటీ చేస్తార‌నే టాక్ పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

గుడివాడ‌నుంచి ఈ సారి పోటీ చేయాల‌నే ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్న‌ట్లు స‌మాచారం. జ‌గ‌న్ బ‌లం అంతా ఉందన్న విమర్శలు ఉన్నాయి. ఈసారి అలాంటి వ్యాఖ్య‌ల‌కు తావివ్వ‌కుండా జిల్లా బ‌య‌ట నుంచి పోటీ చేయాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.కృష్ణా జిల్లాలోని గుడివాడను ఎంచుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గుడివాడలో ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొడాలి నాని ఉన్నారు. కొడాలి నానికి జ‌గ‌న్ అంటె ఎంత అభిమాన‌మో అంద‌రికి తెల‌సిందే. జ‌గ‌న్ కోసం సీటు త్యాగం చేసేందుకు సిద్దంగా ఉన్నారు. కడప జిల్లాతో పాటు రాజధాని ప్రాంతంలో కూడా సత్తా చాటాలని జగన్ ప్రయత్నిస్తున్న సమయంలో గుడివాడలో పోటీ లాభిస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీనిలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -