Saturday, May 4, 2024
- Advertisement -

ఫుల్‌లెంగ్త్‌లో ఐట‌మ్ భామ‌

- Advertisement -
  • స‌న్నీలియోన్ ప్ర‌ధాన పాత్ర‌లో సినిమా

శృంగార చిత్రాల నుంచి సాధార‌ణ సినిమాల వైపు మ‌ళ్లిన తార స‌న్నీలియోన్‌. స‌న్నీ చూపులు, చేష్ట‌లు యువ‌త‌, కుర్ర‌కారు మ‌త్తులో ముంచెస్తాయి. ఆ భామ వెండితెర‌పై మెరుస్తుండ‌డంతో ప్రేక్ష‌కులు ఆనందంలో మునిగిపోతున్నారు. క‌రెంట్ తీగ‌తో షాక్ కొట్టిన ఆ భామ గ‌రుడ‌వేగ‌లో డియ్యో డియ్యో అంటూ స్టెప్పులేయించిన ఈ భామ ఇప్పుడు ఏకంగా సినిమా మొత్తం తానే అంటోంది.

ఈమెతో ఫుల్‌లెంగ్త్ సినిమా తీయ‌డానికి ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ముందుకు వ‌చ్చారు. ఆమె ప్ర‌ధాన పాత్ర‌గా న‌టించ‌డానికి ఖుషీ ప‌డుతూ ఒప్పేసుకుంది. ఈ ప్రాజెక్టుతో స‌న్నీ సంబ‌ర‌ప‌డుతోంది. ఏకంగా రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందనున్న పిరియాడికల్ వార్ డ్రామా. అస‌లు ఇందులో స‌న్నీలియోన్ హీరోయిన్ ఏంటో తెలియ‌దు కానీ ద‌ర్శ‌క నిర్మాత‌లు మాత్రం బాగానే సాహ‌సం చేస్తున్నారు.

Sunny Leone‏

ఈ సినిమా కోసం సన్నీలియోన్ 150 రోజుల కాల్షీట్లను ఇచ్చేసిందని తెలుస్తోంది. విసి వడివుడియన్ తెర‌కెక్కించనున్న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, మ‌ళ‌యాలంలోనూ విడుద‌ల చేయ‌నున్నారు. అంతేలెండి. స‌న్నీతో సినిమా తీస్తే హిట్టే అన్న ధ్యాస‌లో చిత్ర ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఉన్నారు. ఐటమ్‌ బాంబ్‌లా కాకుండా, పూర్తిస్థాయిలో తెరపై కన్పించే ముఖ్య పాత్ర చేయబోతున్నట్లు సన్నీలియోన్‌ వెల్లడించింది. ‘వారియర్‌ ప్రిన్సెస్‌’ అవతారంలో కన్పించనున్న సన్నీలియోన్‌, ఆ పాత్ర కోసం ముందే కసరత్తులు ప్రారంభించిందట.

‘ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో ఇది చాలా ప్రత్యేకం. చాలా చాలా కొత్తగా తెరపై కన్పించబోతున్నాను..’ అంటూ ట్విట్ట‌ర్‌లో ఓ వీడియో ద్వారా సన్నీలియోన్‌, తన కొత్త సినిమా సంగతుల్ని పంచుకుంది. వారియర్‌ ప్రిన్సెస్‌ అయినా, గ్లామర్‌ విషయంలో ఎక్కడా లోటుండదట. నటుడు నవదీప్‌ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కన్పించబోతున్నాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -