Monday, May 6, 2024
- Advertisement -

నిదానంగా ఆడుతున్న శ్రీలంక….మ్యాథ్యూస్ సెంచరీ….చండీమల్ హాఫ్ సెంచరీ

- Advertisement -

న్యూఢిల్లీలో ఇండియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారీ స్కోరును అధిగమించే దిశగా శ్రీలంక ఆచితూచి ఆడుతూ నిదానంగా స్కోరును ముందుకు తీసుకు వెళుతోంది. నిన్న 3 వికెట్ల నష్టానికి 131 పరుగుల వద్ద ఆటను ముగించిన లంకేయులు, నేడు మరో వికెట్ కోల్పోకుండా లంచ్ విరామం వరకూ లాగించారు. ఆపై కూడా నెమ్మదిగా బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో లంక బ్యాట్స్ మన్ మ్యాథ్యూస్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 231 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో శతకం సాధించాడు. ఆట ఆడ‌టం చూస్తే, ఎంత నిదానంగా ఆట సాగుతోందన్న విషయం అర్థమవుతుంది. మ్యాథ్యూస్ కు ఇది భారత్ పై మూడో సెంచరీ. మ్యాథ్యూస్ 98 పరుగుల వద్ద ఉండగా, ఇశాంత్ శర్మ బౌలింగ్ లో లైఫ్ లభించింది. ఆపై రెండు బంతుల్లోనే అతను సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

మరోపక్క, మ్యాథ్యూస్ కు మంచి సహకారాన్ని అందిస్తున్న దాటాడు. ప్రస్తుతం మ్యాథ్యూస్ 100, చండీమల్ 61 పరుగుల వద్ద ఉండగా, లంక స్కోరు 81.3 ఓవర్లలో 211 పరుగులు. భారత తొలి ఇన్నింగ్స్ ను చేరుకోవాలంటే లంక ఇంకా 325 పరుగులు చేయాల్సి వుంది. లంక వికెట్లను పడగొట్టేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు ఆటలో దాదాపు 35 ఓవర్లు బౌలింగ్‌ వేసిన భారత బౌలర్లు ఒక్క వికెట్‌ను కూడా సాధించలేకపోయారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -