Sunday, May 12, 2024
- Advertisement -

టెలుగు ప్ర‌జ‌ల‌కు స‌న్నీలియోన్ న‌మ‌స్కారం

- Advertisement -

స‌న్నీలియోన్ ప్ర‌తి పురుషుడి క‌ల‌ల రాణిగా అభివ‌ర్ణిస్తారు. ఆమె శృంగార తారగా కెరీర్ మొదలుపెట్టి ప్ర‌స్తుతం సినిమాల‌పై మెరుస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్‌ను వ‌దిలిపెట్ట‌కుండా సిినిమాలు చేసేస్తున్నారు. ఐటెం భామకు కేరాఫ్ అడ్ర‌స్‌గా ప్ర‌స్తుతం స‌న్నీ మారింది. ఒకట్రెండు సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన ఆమె మ‌రో సినిమా చేయ‌నున్నారు. ఫుల్ లెంగ్త్ పాత్ర‌లో మెర‌వనున్నారు.

ఇప్పుడు సన్నీ ప్రధాన పాత్రలో ఒక పీరియడ్ వార్ మూవీ మొదలుపెట్టారు. అది కూడా ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్లో స‌న్నీతో సినిమా తీస్తున్నారు. ఆ సినిమా టైటిల్ లోగోను స‌న్నీ ఆవిష్కరించారు. ఈ చిత్రానికి ‘వీర మహాదేవి’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సంద‌ర్భంగా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆమె ప‌ల‌క‌రించారు. న‌మ‌స్కారం టెలుగు ప్ర‌జ‌ల్లారా. నేనే వీర మ‌హారాణి మిమ్మ‌ల్ని త్వ‌ర‌లో ప‌ల‌క‌రించ‌డానికి వ‌స్తున్నా అని మాట్లాడిన వీడియో విడుద‌లైంది.

వీసీ వడివుడియన్ దర్శకత్వంలో పోన్స్ విల్సన్ నిర్మిస్తున్నారు. సన్నీ పూర్తిస్థాయి హీరోయిన్‌గా తెలుగులో రానున్న తొలి సినిమా ఇదే. ఈ సినిమా తమిళం, హిందీ భాషల్లో కూడా విడుద‌ల చేస్తార‌ట‌. మూడు భాషలకూ ఒకే టైటిల్.అయితే స‌న్నీ తెలుగులో ఆమె ఇంతకుముందు ‘కరెంటు తీగ’లో మెరిసినా, ‘గరుడవేగ’లో ఒక ఐటమ్‌ సాంగ్ చేశారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -