Wednesday, May 15, 2024
- Advertisement -

సన్నీలియోన్ పోర్న్‌లో న‌ర‌కం అనుభ‌వించిందా?

- Advertisement -

సన్నీలియోన్ పోర్న్ స్టార్‌గా ఇండ‌స్ట్రీకి పరిచియ‌మైన‌ త‌రువాత కాలంలో బాలీవుడ్‌కి ఐటెం గాళ్‌గా మారింది. సన్నీ అతి త‌క్కువ కాలంలో త‌న కంటు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకుంది.సన్నీలియోన్ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఐటమ్ సాంగ్స్‌లో నటిస్తుంది. సన్నీలియోన్ పోర్న్ రంగానికి దూరంగా ఉండి దశాబ్ధం కావ‌చ్చింది.

పోర్న్ స్టార్ సన్నీ లియోన్ జీవిత నేపథ్యంలో ‘కరణ్ జిత్ కౌర్- ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోని’ పేరుతో డాక్యుమెంటరీని రూపొందించారు. ఇందులో సన్నీ పోర్న్ స్టార్‌గా మారడానికి గల కారణాలు, ఆమె అక్కడ గడిపిన జీవితం, ఎదుర్కొన్న ఇబ్బందులు తదితర విషయాలను చూపించారు. తన డాక్యుమెంటరీ ప్రత్యేక ప్రదర్శనని సన్నీకి చూపించారట.సినిమా చూసిన త‌రువాత భావోద్వేగంతో కన్నీటిపర్యంతం అయ్యారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో ఎమోషనల్ ట్వీట్ చేశారు.

కరణ్‌ జీత్‌ కౌర్‌ సన్నీ అనే నేను సన్నీలియోన్‌గా ఎలా మారాను. పోర్న్ రంగంలోకి రాకముందు ఎలా ఉన్నానో.. మళ్ళీ ఆ కాలంలోకి వెళ్లాలని కోరుకుంటున్నాను. కాని ఆ రోజు ఎప్పటికీ రాదని నాకు తెలుసు. నా పాత వ్యక్తిత్వం నాకు ఎప్పటికీ గుర్తుంటుందని ట్విట్టర్‌లో ఎమోషనల్ ట్వీట్‌ను పోస్ట్ చేశారు సన్నీ.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -