Monday, April 29, 2024
- Advertisement -

హైద‌రాబాద్ గెలిచినా క‌ప్పు చెన్నైకే ఎలానో తెలుసా…?

- Advertisement -

ముంబైలోని వాంఖెడే మైదానం వేదికగా ఆదివారం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 11వ సీజన్‌ ట్రోఫీ కోసం తుది సమరంలో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల తలపడనున్నాయి. పునరాగమనంలోనూ ఘనమైన రికార్డును నిలబెట్టుకుంటూ ఫైనల్‌ చేరిన ధోని జట్టు, అసలు అంచనాలే లేని స్థితి నుంచి అద్భుతంగా పైకెదిగిన విలియమ్సన్‌ సేన. ఎవరు గెలిచినా ఈ సీజన్‌కది ప్రత్యేక ముగింపే.

ధోనీ నాయకత్వంలోని చెన్నై జట్టు ఏ జట్టు ఏడోసారి ఫైనల్ ఆడుతుండగా.. సన్‌రైజర్స్ మూడేళ్లలో రెండోసారి ఫైనల్ చేరింది. ఐపీఎల్‌లో ఇరు జట్లు 9 సార్లు ముఖాముఖి తలపడితే.. ఏడుసార్లు చెన్నై గెలవగా.. రెండుసార్లు సన్‌రైజర్స్ విజయం సాధించింది. గణాంకాల పరంగా ధోనీసేన ఫేవరేట్‌గా కనిపిస్తోంది.

చెన్నై, హైదరాబాద్ ఫ్రాంచైజీలు ఫైనల్లో తలపడుతున్నప్పటికీ.. వాటి యాజమాన్యాలు మాత్రం చెన్నైకి చెందినవే కావడం గమనార్హం. సూపర్ కింగ్స్ జట్టు శ్రీనివాసన్‌కి చెందిన ఇండియా సిమెంట్స్‌కి చెందింది. సన్‌రైజర్స్ యాజమాన్యం సన్‌ టీవీదనే సంగతి తెలిసిందే. ఈ రెండు సంస్థల కార్పొరేట్ హెడ్‌క్వార్టర్లు చెన్నైలోని గ్రీన్‌వేస్ రోడ్‌లోనే ఉన్నాయి. క‌ప్పు ఎవ‌రు గెలిచినా చెన్నైకే చెందుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -