Saturday, May 4, 2024
- Advertisement -

సూప‌ర్ హిట్ అంట‌!సినిమా ఫ్లాప్ బాబాయ్‌:నాని

- Advertisement -

న్యాచుర‌ల్ స్టార్ నాని మ‌రోసారి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నాడు.నాని న‌టించిన చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం సినిమా రిలీజ్ అయి చాలాకాల‌మైంది.ఇప్పుడు దాని గురించి చ‌ర్చ ఎందుకు అనుకుంటున్నారా!కృష్ణార్జున యుద్ధం సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది.పైగా నాని ఈ సినిమాలో డబ‌ల్ రోల్ చేయడంతో సినిమాపై అంచానాలు రెట్టింపు అయ్యాయి.కానీ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. సినిమా వసూళ్ళను కూడా సాధించలేదు.

సాధారణంగా ఏ హీరో కూడా తన సినిమా ఫ్లాప్ అని బహిరంగంగా చెప్పడానికి ఇష్టపడరు. కాని నాని అలా కాదు,త‌న సినిమా అడ‌లేద‌ని బ‌హిరంగంగానే ఒప్పుకున్నాడు.ఓ యూట్యూబ్ ఛానెల్ వారు నాని సూపర్ హిట్ సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా చూడండి అంటూ లింక్ వేశారు. దానిపై స్పందించిన నాని,సూపర్ హిట్ అంట.. అవ్వలేదు బాబాయ్.. ఆడలేదు కూడా.. అయిన మనసు పెట్టి చేశాం. చూసేయండి” అంటూ కామెంట్ చేశాడు.త‌న సినిమా ఫ్లాప్ అని ఒప్పుకొవ‌డం కూడా గ్రేట్ క‌దా అని నాని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -