Thursday, March 28, 2024
- Advertisement -

నందమూరి ఫాన్స్ కి సూపర్ న్యూస్

- Advertisement -

డాన్స్ లు చెయ్యడం లో తెలుగు హీరోల్లో హీరో ఎన్టీఆర్ ది ప్రత్యేక స్థానం గా చెప్పాలి. కొత్త కొత్త మూవ్మెంట్స్ – బాడీ లాంగ్వేజ్ తో ఎన్టీఆర్ ఆకట్టుకుంటాడు. చాలా డిఫరెంట్ యాటిట్యూడ్ తో డాన్సుల్లో కొత్త పంథా క్రియేట్ చేసాడు ఎన్టీఆర్. మాస్ అప్పీల్ కి తొడు డాన్స్ లు ఉండడమే ఎన్టీఆర్ ని అప్పట్లో పెద్ద స్టార్ ని చేసింది.

స్టూడెంట్ నంబర్ -1లో కూచిపూడి కైనా.. దిరననా.. ఆనాటి రాముణ్ణి.. అంటూ అతడు వేసిన క్లాసిక్ స్టెప్పుల్ని ఇప్పటికీ మర్చిపోలేం. నాటి నుంచి అతడు ప్రతి సినిమాలో డ్యాన్సుల పరంగా వైవిధ్యాన్ని చూపించాడు. స్సెషాలిటీని వెండితెరపై ఆవిష్కరించి అభిమానుల్ని పెంచుకున్నాడు. చాలా మంది ఇండస్ట్రీ జనాలే తమకి ఎన్టీఆర్ నటన అన్నా డాన్స్ లు అన్నా చాలా ఇష్టం అని చెప్పడమే దీనికి ఉదాహరణ. ఇప్పుడు తన కొత్త సినిమా నాన్నకు ప్రేమతో లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సూపర్ స్టెప్పులతో ఆదరకోట్టాడు అంటున్నారు.

జూనియర్ కొత్త బాడీ లాంగ్వేజ్ తో ఇరగ దీయబోతున్నాడు అని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ లో భారీ సెట్ వేసి ఒక పాట చిత్రీకరణ సాగుతోంది. ఈ సంగ్ సినిమాకి పెద్ద హై లైట్ అవుతుంది అంటున్నారు. ఎన్టీఆర్ ఇదివరకు ఎప్పుడూ వేయని స్టెప్పులతో ఈ పాటలో కనిపిస్తాడు నటున్నారు.  నాన్నకు ప్రేమతో 2016 సంక్రాంతికి వస్తోంది. ఎన్టీఆర్ ఏం కొత్తగా చేశాడు? అన్నది తెలియాలంటే అంతవరకూ ఆగాల్సిందే. ఇది నిజంగా ఎన్టీఆర్ ఫాన్స్ కి సూపర్ వార్త .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -