Wednesday, May 15, 2024
- Advertisement -

మారుతున్న రాజకీయ పయనం.. ఆనం

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు, రాజకీయ అవసరాలు ఏవీ లేకపోయినా.. పార్టీల పటిష్టతకు అధినాయకులు.. భవిష్యత్తు కోసం జంపింగ్ చేసేందుకు నాయకులు.. అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ విషయం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనం రాంనారాయణ తీరు చూస్తే స్పష్టమవుతోంది.

తమ రాజకీయ భవిష్యత్తును కాంగ్రెస్ మట్టితో కప్పేసిందని ఓ టీవీ చానల్ తో ఆనం మాట్లాడడం చూసి.. ఇది జంపింగ్ వ్యవహారమే అని అంతా డిసైడయ్యారు. విభజన తర్వాత ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల్లో.. కాంగ్రెస్ కు మనుగడ లేదని నమ్మకానికి వచ్చాకే ఆనం ఇలాంటి కామెంట్లు చేసేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అదీ కాక.. తమతో కలిసి వచ్చేందుకు కార్యకర్తలు కూడా సిద్ధంగా లేరన్నట్టు ఆనం మాట్లాడడం… రేపో మాపో గోడ దూకడం కోసమే అని రాజకీయ వర్గాలు కన్ఫమ్ చేస్తున్నాయి.

ఆనం ముందు ప్రస్తుతం రెండు మార్గాలు ఉన్నాయి. అవి ఒకటి అధికార పార్టీ టీడీపీ.. రెండోది ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్. అధికారంలో ఉన్న పార్టీతో ఉంటేనే… రాజకీయంగా భవిష్యత్ ఉంటుందని ఆనం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. టీడీపీతోనే తమ రాజకీయ జీవితం ప్రారంభమైందని ఆనం స్టేట్ మెంట్ ఇవ్వడం వెనక ఇదే కారణమన్న వాదన వినిపిస్తోంది.

వైసీపీ నేతలతో కూడా తనకు సత్సంబంధాలే ఉన్నాయన్న ఆనం మాట.. అయోమయానికి కారణం అవుతోంది. సీనియర్ నాయకుడు, సామాజిక సమీకరణాలు కలిసి వస్తాయన్న అంచనాకు తోడు.. భవిష్యత్ లో కీలక పాత్ర దక్కే హామీ వస్తే.. ఆనం వైసీపీ వైపు కూడా చూసే చాన్సెస్ ఉన్నాయి. ఈ రెండూ కాకుంటే న్యూట్రల్ గా… బీజేపీవైపు చూసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఓవరాల్ గా.. తన కుటుంబంతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటానని ఆనం స్పష్టం చేయడంతో.. త్వరలోనే కాంగ్రెస్ కు మరో నష్టం ఖాయంగా కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -