Sunday, April 28, 2024
- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ : పరిస్థితి అత్యంత విషమం.. కష్టమే అంటున్న వైద్యులు !

- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అనారోగ్యంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. 79 సంవత్సరాల వయకు ఉన్న కృష్ణ గత కొన్నాళ్లు గా పలు రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమం లోనే ఆయన బార్య ఇందిరదేవి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి కృష్ణ కొంత డిప్రెషన్ కు లోనయ్యాడని సమాచారం ఈ క్రమంలోనే ఆయనకు ఇవాళ ఉదయం కొంత గుండె నొప్పి రావడంతో కాంటినెంటల్ హాస్పటల్ కు తరలించారు కుటుంబ సభ్యులు. ఇక తాజాగా వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆయన పరిస్థితి క్రిటికల్ గానే ఉన్నట్లు తెలుస్తోంది..

ఆయన కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారని, 24 గంటలు గడిస్తే తప్ప చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు. ఆయనకు శ్వాసకోశ సంబంధిత వ్యాది కూడా ఉందని, శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వింటిలేటర్ పై శ్వాస అందిస్తున్నట్లు వైద్యులు చెప్పుకొచ్చారు. స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం అంతా ఆయనను రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రస్తుతం అయితే ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్పుకొచ్చారు. ఇక ఎన్నో చిత్రాల్లో నటించి తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న తమ అభిమాన హీరో సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం కుదుటపడాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -