Saturday, May 4, 2024
- Advertisement -

అవంతి ఆడియో లీక్.. ఎప్పుడు ఇదే పనేనా ?

- Advertisement -

ప్రస్తుతం ఏపీలో వైసీపీ నేతలు ఎదుర్కొంటున్న వ్యక్తిగత సమస్యలు బహుశా గతంలో ఏపార్టీ నేతలు కూడా ఎదుర్కొని ఉండరేమో. అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబు, గోరంట్ల మాధవ్.. ఇలా వైసీపీకి చెందిన కీలక నేతలంతా కూడా వారి వ్యక్తిగత వీడియోలు, ఆడియోలు బయటకి రావడంతో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నారు. ఆ మద్య అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ లకు సంబంధించిన ఆడియో లు ఎంతటి సంచలనం సృష్టించయో అందరికీ తెలిసిందే. ఇక ఇటీవల వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా మాట్లాడినా వీడియో కాల్ రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాక దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి విధితమే.

ఆ వీడియో లీక్ వల్ల వైసీపీ పార్టీకి జగన్ సర్కార్ కు జరగాల్సిన నష్టం గట్టిగానే జరిగింది. అది ఫెక్ అని మార్ఫింగ్ వీడియో అని ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ద్వారా నిరూపించే ప్రయత్నం చేసినప్పటికి.. పెద్దగా ఉపయోగం లేకపోయింది. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో ఏది ఫెక్, ఏది ఒరిజినల్ అనేది ప్రజలు ఇట్టే కనిపెట్టేస్తున్నారు. దీంతో రాజకీయ నాయకులు చేసే రాజకార్యాలను ఇట్టే పసిగట్టెస్తున్నారు ప్రజలు. ఇక తాజాగా మరోసారి అవంతి శ్రీనివాస్ కు సంబంధించిన లేటెస్ట్ ఆడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ” లవ్ యూ బంగారం అంటూ మొదలై రొమాంటిక్ సంబాషణలతో సాగిన ఆ ఆడియో క్లిప్ ను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు నెటిజన్స్.

ఎప్పుడు ఇదే పనేనా అవంతి అంటూ కామెంట్లు పెడుతూ ఆ ఆడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇక తాజాగా ఆ ఆడియో క్లిప్ పై స్పందించిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ” తన వాయిస్ ను మిమిక్రీ చేసి ఫెక్ సంభాషణలతో ఆడియో ను సృష్టించారని, తన కీర్తి ప్రతిష్టాలకు, తన రాజకీయ భవిష్యత్ ను నాశనం చేసేందుకే కొందరు ప్రయత్నిస్తున్నారని. అవంతి చెప్పుకొచ్చారు. తాను గత కొన్ని రోజులుగా అయ్యప్ప దీక్షా లో ఉన్నానని, ఇలాంటి ఆడియోలను నమ్మొద్దని, దీనిపై సైబర్ క్రీమ్ లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అవంతి శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనప్పటికి ఇలా వైసీపీ నేతలకు సంబంధించిన వ్యక్తిగత ఆడియోలు, వీడియోలు బయటకు వస్తుండడంతో ఓ రేంజ్ లో ట్రోలింగ్ కు గురౌతున్నారు. మరి వీటిపై అధినేత జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఒక్క ఛాన్స్ అంటున్న పవన్.. జగన్ కు ఇబ్బందే !

జగన్ ధీమా అదే.. అందుకే పొత్తులకు నో ఛాన్స్ !

తెలంగాణ జోలికొస్తే తాట తీస్తా.. మోడి ఫ్రస్టేషన్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -