Monday, April 29, 2024
- Advertisement -

“RRR 2” జక్కన్న క్లారిటీ.. రెడీ అయిపోండి ?

- Advertisement -

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ధర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసిన నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం ” ఆర్ ఆర్ ఆర్ “. ఈ ఏడాది మార్చి లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. దాదాపు 11 వందల కోట్ల వసూళ్లు రాబట్టి మరోసారి తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించింది. ముఖ్యంగా మూవీలో ఎన్టీఆర్ మరియు రాంచరణ్ చూపిన నట విశ్వరూపానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ మూవీ తరువాత తారక్ మరియు చరణ్ లకు ఇతర ఇండస్ట్రీలలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దాంతో ఈ మూవీకి సిక్వల్ తెరకెక్కే అవకాశం ఉందా ? అనే ప్రశ్నలు గట్టిగానే వినిపించాయి. అయితే ఈ మూవీ సిక్వల్ పై గతంలో ఏమాత్రం స్పంధించని దర్శకధీరుడు తాజాగా ” ఆర్ ఆర్ ఆర్ ” సిక్వల్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చికాగోలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జక్కన్న.. ” ఆర్ ఆర్ ఆర్ 2 ” తెరకెక్కించే అవకాశం ఉందని, కథ చర్చలు జరుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే కథపై కసరత్తులు కూడా ప్రారంభించరాట. దాంతో ” ఆర్ ఆర్ ఆర్ 2 ” కచ్చితంగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో ఎన్టీఆర్, రాంచరణ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేశ్ బాబుతో గ్లోబ్ ట్రాకింగ్ యాక్షన్ అడ్వంచరస్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక జక్కన్న మూవీ అంటే మినిమమ్ రెండు సంవత్సరాలైన సెట్స్ పై ఉండాల్సిందే. ఆ లెక్కను చూసుకుంటే మహేశ్ రాజమౌళి మూవీ 2025లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత ” ఆర్ ఆర్ ఆర్ 2 ” ప్లాన్ చేసినప్పటికీ.. సెట్స్ పైకి వెళ్లడానికి మరో ఏడాది కాలం పడుతుంది. అంటే ఒకవేళ ” ఆర్ ఆర్ ఆర్ 2 ” ఒకే అయితే 2027 ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మహేశ్ కంటే ముందే.. అల్లు అర్జున్ సూపర్ ప్లాన్ ?

బింబిసార సిక్వల్ లో రాంచరణ్..ఫ్యాన్స్ కు పండగే?

గాడ్ ఫాదర్ ఎఫెక్ట్..చిరు ఈసారి ఆ తప్పు చేయడట?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -