Saturday, May 18, 2024
- Advertisement -

అనుష్కకు మ‌రచిపోలేని ప్ర‌శంస

- Advertisement -

హీరోయిన్ ఓరియేంటెడ్ సినిమాల‌తో ఆక‌ట్టుకుంటున్న అనుష్క ఇటీవ‌ల భాగ‌మ‌తిగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆ సినిమా డిఫ‌రెంట్ జోన‌ర్‌లో రావ‌డం.. అనుష్క త‌న‌దైన న‌ట‌న క‌న‌బ‌ర్చ‌డంతో సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. అనుష్క న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు కురిపిస్తూనే ఉన్నారు. ఈ సినిమా విజ‌యంతో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో అనుష్కకు తిరుగులేదని చాటింది.

అనుష్క నటనకు మంచి గుర్తింపు ల‌భిస్తోంది. విమర్శకుల మెప్పు పొందుతోంది. ఈ సినిమాకు, అనుష్క‌కు మ‌ర‌చిపోలేని ప్ర‌శంస వ‌చ్చింది. ఆ ప్ర‌శంస ఎవ‌రు చేశారంటే త‌లైవా, సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ నుంది. రజనీకాంత్ నుంచి త‌న‌కు స‌ర్‌ప్రైజ్ ఫోన్ కాల్ వ‌చ్చింది ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో అనుష్క తెలిపింది.
రజనీకాంత్ స్వయంగా ఫోన్ చేసి భాగమతి సినిమాలో త‌న‌ నటనను మెచ్చుకున్నట్లు చెప్పింది. రజనీకాంత్ నుంచి సర్‌ప్రైజ్ కాల్ రావడమే కాకుండా నటన బాగుందచి చెప్పడం చాలా థ్రిల్లింగ్ అయ్యాయ‌ని మురిసిపోయింది.

భాగమతి జి.అశోక్ ద‌ర్శ‌క‌త్వంలో యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ఈ సినిమా థియేట‌ర్‌ల‌లోకి వ‌చ్చి తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో హిట్ టాక్ సొంతం చేసుకుంటున్నాయి. తెలుగులో బాగా ఆడుతున్నా తమిళంలో ప్రేక్ష‌కుల మెప్పు పొంద‌డం లేదు. సూపర్‌స్టార్ ప్ర‌శంస‌తో ఈ సినిమా ల‌బ్ధి పొందే అవ‌కాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -