Friday, April 19, 2024
- Advertisement -

విడుదలకు సిద్ధమవుతున్న సూపర్ స్టార్ మూవీ..!

- Advertisement -

రోబో సినిమా తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ కు సరైన హిట్ పడలేదు. రోబోకు సీక్వెల్ గా వచ్చిన రోబో 2.0 కూడా ఆశించినంత విజయాన్ని అందించలేదు. ఆ తర్వాత వచ్చిన పేట, దర్బార్ సినిమాలు కూడా అంతంత మాత్రంగానే ఆడాయి. ప్రస్తుతం రజనీకాంత్ సిరుతై శివ దర్శకత్వంలో అన్నాత్తే అనే సినిమాలో నటిస్తున్నాడు. కుటుంబ కథా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శివ తమిళ్ లో వరుసగా విజయాలు అందుకొన్నాడు. అజిత్ తో శివ వరుసగా మూడు సినిమాలు చేసి మూడు హిట్లు అందుకున్నాడు. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన వీరమ్, వేదాళం, విశ్వాసం సూపర్ హిట్ గా నిలిచాయి.

వరుస విజయాలు అందుకున్న శివకు రజినీకాంత్ తో సినిమా చేసే అవకాశం దక్కింది. రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం చేస్తానని కొద్దిరోజులు విరామం తీసుకోవడం, ఆ తర్వాత రజినీ కరోనా బారిన పడడం తదితర కారణాలతో అన్నాత్తే మూవీ షూటింగ్ చాలా ఆలస్యంగా నడిచింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.

ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. రజినీకాంత్ వెర్షన్ కు సంబంధించి డబ్బింగ్ ఇప్పటికే పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ సినిమాలో నటిస్తున్న మీనా తన పార్ట్ కు సంబంధించి డబ్బింగ్ చెబుతున్నారు. ఆ తర్వాత ఖుష్బూ, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్ తదితరులు డబ్బింగ్ చెప్పనున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ మూవీ నవంబర్ 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -